కొన్ని వారాల క్రితం ఐటి అధికారులు సినీ ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సురేష్ బాబు సహా కొందరు సెలెబ్రిటీల నివాసాల్లో ఐటి అధికారులు దాడులు జరిపారు. ఇది ముగిసిన కొన్ని రోజులకే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ టార్గెట్ గా అధికారులు నేడు(మంగళవారం) జీఎస్టీ రైడ్స్ ప్రారంభించారు. 

కొన్ని రోజుల క్రితమే లావణ్య త్రిపాఠి, అనసూయ, యాంకర్ సుమ లాంటి సెలెబ్రిటీల ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలని అనసూయ, సుమ ఖండించారు. తాజాగా మరికొందరి ప్రముఖల సంస్థలు, ఇళ్లపై అధికారులు సోదాలు నిర్వహించారు. 

కష్టపడి ఈ స్థాయికి వచ్చా.. తప్పుడు వార్తలపై మండిపడ్డ సుమ!

జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న వారిలో నా పేరు సూర్య ఫేమ్ వక్కంతం వంశీ, హారిక అండ్ హాసిని సంస్థలతో పాటు 15మంది ప్రముఖులు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు నకిలీ పత్రాలతో జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మీడియాని ఏకిపారేసిన యాంకర్ అనసూయ!

ఈ ఉదయమే జీఎస్టీ అధికారులు ఏకకాలంలో రైడ్స్ ప్రారంభించారు. జీఎస్టీ దాడులు జరుగుతున్న మిగిలిన సెలెబ్రిటీల వివరాలు అందాల్సి ఉంది. ఇటీవల లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ కోట్లల్లో జీఎస్టీ ఎవవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. 

కొన్ని వారల క్రితం సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో, వెంకటేష్, హీరో నానితో పాటు మరికొందరు ప్రముఖుల నివాసంలో ఐటి అధికారులు ఏక కాలంలో దాడులు జరిపారు. ప్రస్తుతం అదే తరహాలో జీఎస్టీ అధికారులు కూడా టాలీవుడ్ ని టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది. సోదాలు నిర్వహించిన తర్వాత వివరాలని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.