మాస్ మహారాజాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రవి తేజ మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు దర్శకుడు మాస్ రాజాప్రాజెక్ట్ టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు. 

ఇక నేడు సినిమా లాంచ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈవెంట్ కి ముందే సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. రవితేజ క్యారెక్టర్ కి తగ్గట్టుగా మాస్ జనాలను ఆకట్టుకునే విధమా 'క్రాక్' అనే టైటిల్ ని సెట్ చేశారు.  షూటింగ్ ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు.

 

డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ గోపీచంద్ ఆ తరువాత రవితేజతో బలుపు అనే సినిమా చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వడంతో గోపి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పండగ చేస్కో - విన్నర్ సినిమాలు ఈ దర్శకుడిని కాస్త దెబ్బేశాయి. 

తనకు ఎప్పటినుంచో పరిచయమున్న మాస్ రాజాతో ఎట్టకేలకు ఒక సినిమా చేయడానికి ముహూర్తం సెట్ చేసుకున్నాడు.ఇక సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. 

అయితే ఆ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్ అనే టాక్ వచ్చింది.  గతంలోనే రవితేజ తేరి రీమేక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు సినిమా ఫైనల్ అయ్యిందని టాక్ వచ్చినప్పటికి ఎందుకో సెట్ కాలేదు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా విజయ్ 'తేరి' రీమేక్ అని రూమర్స్ వచ్చాయి.

Read also: డిజాస్టర్ల ఎఫెక్ట్.. హీరోలను బతిమాలుతున్న సీనియర్ డైరెక్టర్లు

ఇక ఆ రూమర్స్ డోస్ పెరగకముందే దర్శకుడు గోపి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రవితేజతో చేయబోతున్న సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదని ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ కూడా చెప్పాడు.  రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారాంగా చేసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాధానం ఇచ్చాడు. కొన్నిళ్ళ క్రితం జరిగిన సంఘటనలు సినిమా కథలో మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.