Asianet News TeluguAsianet News Telugu

'దర్బార్' తమిళ టాక్.. వర్కవుట్ అయ్యినట్లేనా?

పోటీ సినిమాలు కూడా ఏమీ లేకపోవటంతో ఈ పొంగల్ కు రజనీ సినిమానే తమిళం వాళ్లకు పండగ సినిమా కానుంది. అలాగే ఈ చిత్రం తమిళ వెర్షన్ ...అమెరికాలో కూడా బాగా వర్కవుట్ అయ్యింది.

Good Start for Darbar at the Tamil nadu
Author
Hyderabad, First Published Jan 10, 2020, 12:45 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ చిత్రం నిన్న (గురువారం) మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. వరసగా తెలుగులో రజనీ సినిమాలు ఫ్లాఫ్ అవుతున్న ఈ టైమ్ లో వచ్చిన ఈ చిత్రం బెటర్ అనిపించుకుంది.ఇక తమిళంమలో రజిని సినిమా అంటే ఉండే రచ్చే వేరు. అయితే గత కొన్ని చిత్రాలుగా రజినీ సినిమాలు వరసగా ఫ్లాఫ్ అయ్యి ఫ్యాన్స్ ని నిరుత్సాహపరచటంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు కోరుకున్న పూర్తి అంశాలతో రజినీ సినిమా వచ్చి చాలా కాలమైంది. దాంతో దర్బార్ సినిమాపై  ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రిలీజైన ఈ చిత్రం తమిళంలో పెద్ద హిట్ అనే టాక్ తెచ్చుకుంది.

పోటీ సినిమాలు కూడా ఏమీ లేకపోవటంతో ఈ పొంగల్ కు రజనీ సినిమానే తమిళం వాళ్లకు పండగ సినిమా కానుంది. అలాగే ఈ చిత్రం తమిళ వెర్షన్ ...అమెరికాలో కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ప్రీమియర్ షోలకు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యకాలంలో కబాలి తర్వాత ఏ రజనీ సినిమాకు రాని కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఈజీగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తెలుగులో ఆ మ్యాజిక్ జరిగే అవకాసం కనపడటం లేదు.

బ్రేకింగ్: మహేష్ బాబు ఇంటి ముందు ధర్నా

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 140 కోట్లు బిజినెస్ జరిగింది. తమిళ సిని చరిత్రంలో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మూడో చిత్రం ఇది కావటం విశేషం. తెలుగులోనూ 14 కోట్లు దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అయితే ఇక్కడ రజనీకి, మురగదాస్ కీ మార్కెట్ పడిపోవటంతో ఆ స్దాయిలో బిజినెస్ జరగలేదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మరో రెండు పెద్ద సినిమాలను తట్టుకుని ఏ మేరకు తెలుగులో నిలబడుతుందో చూడాలి.
 
ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.  లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios