Asianet News TeluguAsianet News Telugu

Bheeshma Movie:‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్ 4 మిలియన్ల వ్యూస్.. నితిన్ స్పెషల్ పోస్ట్!

కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. 

Good response Bheeshma first glimpse
Author
Hyderabad, First Published Nov 9, 2019, 5:31 PM IST

నితిన్,రష్మిక ,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘కథానాయకుడు నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా…కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియో కి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

''బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? నువ్ వర్జినేనా..?'' నివేదాపై అసభ్య ప్రశ్నలు

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను సుప్రసిద్ధ దర్శకుడు, మా గురూజీ త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి.వీటికి ముందు ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేయటం జరిగింది. వీటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది.

‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

Follow Us:
Download App:
  • android
  • ios