1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి. జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా అదే పేరుతో ఓ చిత్రం రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో వంగవీటి ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ (సాండి) నటిస్తున్నాడు. దళం మూవీ ఫేం జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రం గురించి ఫిల్మ్ నగర్ టాక్ ఏంటనేది చూద్దాం.

జార్జిరెడ్డి హత్య.. అంతకుముందు నాతోనే ఉన్నాడు: తమ్మారెడ్డి

అందుతున్న సమాచారం మేరకు జార్జిరెడ్డి సినిమా  విద్యార్ది రాజకీయాలు, డబ్బైల నాటి పరిస్దితులు ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ చాలా డీసెంట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కూడా మంచి ఇంటెన్సిటీతో వేసారు. అయితే సెకండాఫ్ అక్కడక్కడా లాగ్ లు ఉండటం, స్లోగా నేరేషన్ సాగటం జరిగిందని చెప్తున్నారు. అలాగే డబ్బైల నాటి పరిస్దిలను అంత బాగా రీక్రియేట్ చేయలేకపోయారని చెప్తున్నారు.

అయితే దర్శకుడు చాలా నిబద్దతతో తెరకెక్కించారని, జార్జిరెడ్డి సినిమాని ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా ఓ విద్యార్ది నాయకుడు బయోపిక్ గా చూస్తే ఈ సమస్యలు కనిపించవని చెప్తున్నారు. అలాగే  జార్జి రెడ్డి గురించి తెలిసిన వారంతా సినిమాని హత్తుకుంటారని, అయితే ఆయన గురించి తెలియని ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఏక్సెప్ట్ చేస్తే మంచి హిట్ అవుతుందని చెప్తున్నారు. ఈ సినిమాతో  జార్జిరెడ్డి దర్శకుడుకు మంచి పేరు వచ్చి, పెద్ద ఆఫర్స్ వస్తాయని అంటున్నారు. అయితే ఇదంతా కేవలం ఫిల్మ్ నగర్ టాక్ మాత్రమే. అసలు ఏంటనేది రేపు తేలనుంది.
   
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ...‘మైక్ టివి ద్వారా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాం.. ఒకసారి దామోదర్ రెడ్డి, జీవన్ రెడ్డి లు జార్జిరెడ్డి కథ గురించి చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లు కాకుండా జార్జిరెడ్డి కథ లో ప్రత్యేకత నన్ను ఆకర్షించింది. అందుకే మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా ఖర్చు పెట్టాం. ఉస్మానియా సెట్ ను నిర్మించాం.. ఇప్పుడు మా అంచనాలను మించి జార్జిరెడ్డి వస్తున్న స్పందన మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ కథ తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది' అన్నారు.

దామోదర్ రెడ్డి మాట్లాడుతూ: ‘ దళం తర్వాత జీవన్ ఉస్మానియాలో అయిదు నెలలు ఈ కథ రీసెర్చ్ కోసం గడిపాడు. జార్జిరెడ్డి ప్రెండ్స్ అందరినీ కలిసాడు.  ఒక మేథావి, ఫైటర్, అన్యాయాలను ఎదుర్కోవడంలో ముందుండే లక్షణం ఇవన్నీ కూడా ఒక హీరో ఇమేజ్ కుండే లక్షణాలే. అందుకే జార్జిరెడ్డి కథకు హీరోలు అవసరం లేదు, ఆ కథలోనే హీరోయిజం ఉంది అనిపించింది. అందుకే ఇమేజ్ ఉన్న హీరోల కోసం ప్రయత్నించలేదు. ఏదైనా ఉద్యమం లో గానీ, ఆర్గనేజేషన్ లోగానీ మంచి చెడులు ఉంటాయి. వాటని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేసాం అంతే కానీ ఎవర్నీ హీరోలుగా, విలన్లుగా చూపించలేదు. జార్జిరెడ్డితో ఈ తరం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఆ నమ్మకం మాకు ఉంది ’ అన్నారు.