Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్ టాక్ :“జార్జ్ రెడ్డి”... బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరం?

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు జార్జి రెడ్డి చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం వైడ్ థియేట్రికల్ రైట్స్ ని మూడు కోట్లకు కొన్నారని ,దాంతో మరో 74 లక్షలు వస్తే సినిమాకు బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్లే అని, ఈ వీకెండ్ లో అది సాధ్యమవుతుందని లెక్కలు వేస్తున్నారు. 

George Reddy Nears Break Even
Author
Hyderabad, First Published Nov 28, 2019, 10:40 AM IST

కేవలం ఒకే ఒక్క ట్రైలర్ తో “జార్జ్ రెడ్డి” బిజినెస్ అయ్యిపోయింది.   నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో నెంబర్ వగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “జార్జి రెడ్డి” తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి సొంత చేసుకుని రిలీజ్ చేసారు. మెగా బ్రదర్శ్ సపోర్ట్ దొరకటం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చిరంజీవి పాటలు రిలీజ్ చేయటం, మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమా గురించి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయటం కూడా కలిసొచ్చింది.

పవన్ సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ ఈవెంట్ జరగలేదు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా రిలీజ్ అయిన “జార్జ్ రెడ్డి” యావరేజ్ టాక్ తెచ్చుకున్నా..కలెక్షన్స్ పరంగా స్టడీగానే ఉంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు జార్జి రెడ్డి చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్లు షేర్ వసూలు చేసింది.

షూటింగ్ సెట్ లో కింద పడి మరణించిన నటుడు!

ఈ చిత్రం వైడ్ థియేట్రికల్ రైట్స్ ని మూడు కోట్లకు కొన్నారని ,దాంతో మరో 74 లక్షలు వస్తే సినిమాకు బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్లే అని, ఈ వీకెండ్ లో అది సాధ్యమవుతుందని లెక్కలు వేస్తున్నారు. అయితే సినిమా కు ఎక్సపెక్ట్ చేసిన బజ్ క్రియేట్ కాకపోవటం, సినిమా చూసిన వాళ్లు అంత సీన్ లేదు అనటం నెగిటివ్ గా మారి , కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. సినిమా ని సరిగ్గా తీస్తే కనుక..పెద్ద హిట్ అయ్యేదని, మంచి ఆపర్చునిటీని పాడు చేసారని, ఓ పరవ్ ఫుల్ స్టోరీని మిస్ యూజ్ చేసారని సోషల్ మీడియా అంటోంది.

గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసారు. సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు.

“జార్జిరెడ్డి “చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మించారు. సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, పీఆర్వో: జీ.ఎస్.కే మీడియా, నిర్మాతలు: అప్పిరెడ్డి, దామురెడ్డి కొసనం, రచన, దర్శకత్వం: జీవన్ రెడ్డి.

Follow Us:
Download App:
  • android
  • ios