తైవాన్ కి చెందిన నటుడు, మోడల్ గాడ్ ఫ్రే గావో చైనాలో మృతి చెందారు. టీవీ షో కోసం షూటింగ్ జరుగుతుండగా.. సడెన్ గా కిందపడి కన్నుమూశాడు. 35 ఏళ్ల గాడ్ ఫ్రే గావో చైనాలో టీవీ రియాలిటీ షో 'చెజ్ మీ'లో అతిథిగా పాల్గొన్నారు.

ఊహించని విధంగా సెట్ లో కింద పడిపోయిన అతడిని అక్కడున్నవారు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అతడిని పరీక్షించిన డాక్టర్లు గాడ్ ఫ్రే గావో గుండెపోటుతో మరణించారని నిర్ధారించారు. అతడి మృతదేహాన్ని తైవాన్ కి తరలించారు.

ఈ క్రమంలో షో నిర్మాత మాట్లాడుతూ.. టీమ్ ఈవెంట్ లో గాడ్ ఫ్రే గావో కింద పడిపోయి, స్పృహ కోల్పోయాడని వెంటనే హాస్పిటల్ కి తరలించామని చెప్పారు. అక్కడ అతడు మృతి చెందినట్లు చెప్పారు. గాడ్ ఫ్రే పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. టీవీ షోలు, సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.