ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి నాయకుడు జార్జి రెడ్డి జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జార్జి రెడ్డి'. జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత నెలలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఫోర్త్ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది. ఈ మేరకు డిసెంబర్ 22 మరియు 23వ తేదీల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నోయిడా, ఢిల్లీలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి.

బాలయ్య హ్యాట్రిక్.. చెప్పేవాళ్లే లేరా?

చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న 'జార్జ్ రెడ్డి' చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లెవల్ కి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానున్నారు.

ఈ సినిమాలో సత్యదేవ్‌, పవన్‌ రమేష్‌, మనోజ్‌ నందం, ముస్కాన్‌, సంజయ్‌ రెడ్డిలు కీలక పాత్రల్లో నటించారు.