ఒకే సంవత్సరంలో మూడు వరస డిజాస్టర్ సినిమాలు రావటం అంటే మాటలు కాదు. ఆ రికార్డ్ ని బాలయ్య సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఇలాంటి రేర్ హ్యాట్రిక్ బాలయ్య ఖాతాలో క్రెడిట్ అవుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో రెండు డిజాస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు 'రూలర్' కూడా అదే దిశగానే సాగుతోంది.   అయితే బాలయ్యకు ఆ విషయం ఇంకా తెలియదు అంటున్నారు.

ఆయనతో ధైర్యంగా సినిమా రిజల్ట్ గురించి మాట్లాడే ధైర్యం చేసేవారు తక్కువ కావటంతో...రూలర్ ఫ్లాఫ్ అనే విషయం ఆయనకు ఎవరూ రివీల్ చేయలేదట. దాంతో రూలర్ హిట్ అన్న ధోరణిలోనే ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతో్ంది.  నట సింహా నందమూరి బాలకృష్ణ హీరోగా వెట‌రన్ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌.

సోనాల్ చౌహాన్‌, వేదిక లాంటి అందాల భామ‌లు న‌టించిన ఈ చిత్రాన్ని కేఎస్.ర‌వికుమార్ లాంటి మాస్ డైరెక్ట‌ర్ దర్శకత్వంలో చేసారు.  క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే రిలీజ్ అయ్యాక పరిస్దితి రివర్స్ అయ్యింది. పూర్తిగా ఔట్ డేటెడ్ క‌థాంశంతో రూల‌ర్ తేలిపోయాడ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  

అయితేనేం బాల‌య్య‌కు మాస్ ఇమేజ్ అంతో ఇంతో ఉండటంతో.. తొలిరోజు 4కోట్ల షేర్ వ‌సూలైంది. అయితే రూలర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలకు అమ్మారు. రూలర్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేయటంతో..చాలా చోట్ల కలెక్షన్స్ పూర్తి గా డ్రాప్ అవటం మొదలైంది. దాంతో  ఈ సినిమా కోలుకోవడం ఇప్పుడు చాలా కష్టం అని ట్రేడ్ తేల్చేసింది.  

మరోప్రక్క ఇప్పటికే మార్కెట్లో ఉన్న వెంకీమామ పెద్ద పోటీ ఇచ్చింది.  అలాగే రూలర్ తో పాటు రిలీజైన ప్రతిరోజూ పండగే సినిమాకు ఫరవాలేదనే వచ్చింది. దబంగ్-3 ఫ్లాఫ్ అన్నా..దాని స్దాయిలో అది పోటీ ఇస్తోంది. ఇలాంటి టఫ్ కండిషన్స్ లో రూలర్ సినిమా కష్టమనే అంటున్నారు. రూలర్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 17 కోట్ల రూపాయలు రావాలి.