ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డి ఈ శుక్రవారం (22న) విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ రోజు ప్రీమియర్  షో కు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ బాగానే ఉన్నా..సెకండాప్ బాగోలేదంటా చాలా మంది పెదవి విరిచారు. ఈ నేపధ్యంలో వీకెండ్ కలెక్షన్స్ పరిస్దితి ఎలా ఉంది. పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకోగలడా జార్జి రెడ్డి లేదా...అంతకు మించి రెవెన్యూ రాబట్టగలడా అనేది అంతటా చర్చగా మారింది.

హీరోతో డేటింగ్.. కాస్త ప్రైవసి ఇవ్వండి బాబు!

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం మిగతా చోట్ల నైజాం లో యూత్ మాత్రం మాకు రివ్యూలతో,మౌత్ టాక్ తో సంభందం లేదు..జార్జి రెడ్డి ఎఎవరో చూసి వస్తాం అంటూ థియోటర్స్ లో దూకుతున్నారు. వీకెండ్ నైజాంలో బాగానే కలెక్టు చేసింది. ఇంటెన్స్ ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టి ని ఆకర్షించటం ప్లస్ అయ్యింది. దానికి తోడు  ఈ శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ  'జార్జ్ రెడ్డి' స్దాయిలో కూడా ఏ సినిమా బజ్ క్రియేట్ చేయలేకపోయింది.

అయితే సోషల్ మీడియాలో ఈ సినిమాపై బాగా చర్చలు జరుగుతున్నాయి.  జార్జ్ రెడ్డి జీవితంలోని యాక్షన్ ఎపిసోడ్స్ పై దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టి.. ఆయన మేథాశక్తి ని తక్కువ చేసాడంటున్నారు. యాక్షన్ పార్ట్ లో  కర్చీఫ్ బ్లేడ్ ఫైట్.. ఐరన్ ఫైర్ బాల్ ఫైట్ యూత్ కు బాగా నచ్చుతోంది.

దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ:‘‘ జార్జిరెడ్డి ని తెరమీద పరిచయం చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. విద్యార్ధులనుండి, ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది. జార్జిరెడ్డి పేరు ఇప్పుడు దేశంలో వినపడుతుంది. ఆయన చరిత్ర గురించి ఒకటిన్నర సంవత్సరాలు అధ్యయనం చేసి కథను రెడీ చేసుకున్నాను.  నాలుగు రెచ్చే గొట్టే సీన్స్ ను తీసి కాంట్రవర్సరీలు చేయడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఈ సినిమా మూలంగా ఎలాంటి ఘర్షణనలు రాకూడదని జాగ్రర్త పడ్డాను.  జార్జిరెడ్డి యూత్ కి కనెక్ట్ అయ్యాడు అది చాలు నాకు’’ అన్నారు.