సినిమా ఇండస్ట్రీలో మన హీరోయిన్లు అవకాశాల కోసం తరచూ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పుడు పెళ్లైన ఓ హీరోయిన్ కూడా అదే పని చేస్తోంది. ఒకప్పుడు తెలుగులో సూపర్ ఫాలోయింగ్ దక్కించుకున్న జెనీలియా అగ్ర హీరోలందరి సరసన కలిసి నటించింది.

పెద్దగా గ్లామర్ షో చేయనప్పటికీ తన క్యూట్ లుక్స్, నటనతో నెట్టుకొచ్చింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం జెనీలియా ఫ్యామిలీ రాజకీయంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

రిఫ్రెష్ థాట్ : శేఖర్ కమ్ముల, చైతు చిత్రం స్టోరీ లైన్

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విలాస్ రావ్ తనయులు ఇద్దరు ఘన విజయాలు సాధించారు. ఇలా రాజకీయంగా తమ సత్తా చాటుతున్నారు. మరోపక్క జెనీలియా భర్త బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. కానీ సోలో హీరోగా సరైన సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. ఇటీవల అతడు నటించిన 'హౌస్ ఫుల్ 4' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు జెనీలియా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో చాలా మంది పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ  సత్తా చాటుతున్నారు. అందుకే ఇప్పుడు జెనీలియా కూడా తన సత్తా చాటాలని చూస్తోంది.

అందుకే తరచూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే సినిమాల్లో రీఎంట్రీ విషయంలో తనకు తొందరేం లేదని.. మంచి పాత్ర దొరికినప్పుడే రీఎంట్రీ ఇస్తానంటూ చెబుతోంది. కానీ మరోవైపు తన హాట్ ఫోటోలతో దర్శకనిర్మాతలకు గేలమేస్తోంది!

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Always remember you are unique just like everyone else- Word 👍

A post shared by Genelia Deshmukh (@geneliad) on Dec 1, 2019 at 9:05am PST

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

No one reaches the finish line by looking back

A post shared by Genelia Deshmukh (@geneliad) on Dec 1, 2019 at 9:06am PST