Asianet News TeluguAsianet News Telugu

రిఫ్రెష్ థాట్ : శేఖర్ కమ్ముల, చైతు చిత్రం స్టోరీ లైన్

మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో ఓ  చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఫిధా' తో తెలుగులో పేరు తెచ్చుకున్న  సాయి పల్లవి చైతు సరసన నటిస్తోంది.  మ్యూజికల్ లవ్ స్టొరీ గా తెర మీద ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

Sekhar Kammula,Naga Chaitanya movie story line
Author
Hyderabad, First Published Dec 2, 2019, 6:30 PM IST

మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో ఓ  చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఫిధా' తో తెలుగులో పేరు తెచ్చుకున్న  సాయి పల్లవి చైతు సరసన నటిస్తోంది.  మ్యూజికల్ లవ్ స్టొరీ గా తెర మీద ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

శేఖర్ కమ్ముల చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ కూడా రూరల్ తెలంగాణా నుంచి సిటీకు పెద్ద పెద్ద కలలు,కోరికలతో వస్తారు. వాటిని నెరవేర్చుకునే క్రమంలో వాళ్లిద్దరూ చాలా ఇబ్బందులు,కష్టాలు పడతారు. ఆ జర్నీలోనే వీళ్దిద్దరూ కలవటం జరుగుతుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ తమను తాము ప్రపంచం ముందు ఎలా ఆవిష్కరించుకున్నారనే యాంగిల్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. వీరిద్దరూ తెలంగాణా స్లాంగ్ లోనే మాట్లాడతారు. ఇది కొన్ని జీవితాలను కొత్త కోణంలో చూపిస్తుంది. తెలుగు తెరపై ఇలాంటి కథ చూడలేదు. నేటి యూత్ జీవితానికి బాగా దగ్గరగా ఉండే సినిమా ఇది. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ పాత్రలు ప్రేక్షకులకు బాగా పడతాయని చెప్తున్నారు.

ఇక ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.  రీసెంట్ గా మజిలీ అంటూ హిట్ కొట్టిన నాగచైతన్య తాజా చిత్రం కావటంతో ... ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. కూల్ యూత్ ఫుల్ ఎంటర్టెయినర్ గా రూపొందుతోంది.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ  ‘ విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ లో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాస ని నాగ చైతన్య బాగా ఇష్ట పడి నేర్చుకున్నాడు.నాగ చైతన్య పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. సాయి పల్లవి ఈ కథ కు పెర్ఫెక్ట్ గా సరిపోతుంది. నా సినిమాలలో మ్యూజిక్ బలం గా ఉంటుంది. ఇందులో ఆ బలం మరింత గా కనిపిస్తుంది. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘ అన్నారు.

ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ  ని  ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.  మూడు షెడ్యూల్లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలకమైన సీన్స్  షూటింగ్  జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios