గీతాంజలి కు కెరీర్ ప్రారంభంలో అప్పటికే స్టార్ గా వెలుగుతున్న ఎన్టీఆర్ చాలా సహాయం చేసారు. ఆ విషయాన్ని ఎప్పుడూ ఆమె చెప్తూండేవారు.   ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె ఆయన్ని గాడ్ ఫాధర్ గా ఎప్పుడూ చెప్తూండేది. ఎన్టీఆర్ తో తన పరిచయం, ఆయన తనకు సహాయం చేసిన తీరుని ఓ సారి ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.

గీతాంజలి అసలు పేరు ఏంటి? ఎందుకు మార్చుకుంది!

గీతాంజలి మాట్లాడుతూ...." మాది కాకినాడ. సినిమా అవకాశాల కోసం మద్రాసు వచ్చాక కొద్దికాలం కష్టపడ్డాను. స్వశక్తితో పైకి వచ్చాను. నాలుగైదు సినిమాల్లో చిన్న వేషాలు వేశాను. బి.ఎ.సుబ్బారావు గారి సినిమా రాణీరత్నప్రభలో వెంకటసత్యం గారు ఒక డ్యాన్స్‌ అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో పెద్దయ్యగారు చూశారు. పెద్దయ్య గారు అంటే రామారావుగారు. ఆయన్ని అలా పిలిచేదాన్ని.పెద్దయ్యగారు నన్ను చూసి చాలా ఇన్నోసెంట్‌గా ఉంది. సీత పాత్రకు సరిగ్గా సరిపోతుంది, అవకాశం ఇద్దాం అని ఆఫీసుకి పిలిపించారు. అప్పటికప్పుడు అగ్రిమెంట్‌ పూర్తయిపోయింది. ఖాళీ సమయాల్లో పెద్దయ్యగారి ఇంట్లోనే ఉండేదాన్ని. ఆయనతో అంత చనువు పెరిగింది. ఆ ఇంట్లో అందరూ నన్ను సీతమ్మ అనే పిలిచేవారు అన్నారు.
 
అలాగే మా నాన్న తరువాత నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే. వారి పిల్లలు ఎంతో అభిమానం చూపిస్తారు. వాళ్లు చూపించే అభిమానానికి చాలా ముచ్చటేస్తుంది. పెద్దయ్యగారి పిల్లలంతా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇక  పెద్దయ్యగారు వాళ్ల బిడ్డలతో సమానంగా మమ్మల్ని సమానంగా చూశారు. ఆయన మమ్మల్ని సినిమా ఆర్టిస్టులుగా ఎప్పుడూ చూడలేదు. అటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే మేం లేకపోతే ఎలా? అని పార్టీలో చేరాను.

ఇక ఓ సారి  పెద్దయ్యగారు కోప్పడ్డారని చెప్తూ...  ఒకరోజు మహావిష్ణువు పాదాలను లక్ష్మీదేవి నొక్కుతున్న సీన్‌ ఉంటుంది. ఆ సమయంలో దేవతలు వచ్చి భూలోకంలో ఉన్న సమస్యల గురించి విన్నవించుకుంటారు. ఆ సమయంలో మహావిష్ణువు దేవీ నువ్వు వెళ్లాలి. భక్తులు కష్టాల్లో ఉన్నారని అంటారు. అందుకు సమాధానంగా నేను ఒక పద్యంలో నా డైలాగ్‌ చెప్పాలి. కానీ ఐదారు టేకులు తిన్నా ఓకే కాలేదు. అప్పుడు పెద్దయ్యగారికి కోపం వచ్చింది. ఏం డైలాగ్‌లు నేర్చుకోలేదా? బాగా నేర్చుకోవాలి అని అన్నారు. అలా అనేసరికి సెట్‌లోనే ఏడ్చేశాను. కానీ ఆ తరువాత ఆయనే నన్ను ప్రోత్సహించి టేక్‌ ఓకే అయ్యేలా చేశారు అన్నారామె.