సినీ నటులు అసలు పేరు మార్చుకోవటం. వేరే పేరు పెట్టుకుని దానితో కంటిన్యూ అవటం చాలా మంది జీవితాల్లో జరిగింది. కొత్తగా పెట్టుకున్న పేర్లుతో క్లిక్ అవుతూంటారు. కొంతకాలానికి అసలు పేర్లు మర్చిపోతూంటారు కూడా. అలాంటిదే ప్రముఖ నటి గీతాంజలి జీవితంలో కూడా జరిగింది. ఆమె అసలు పేరు మణి. అయితే తర్వాత సినిమా పరిశ్రమకు వచ్చాక తొలి చిత్రానికే గీతాంజలి అని పేరు మార్చుకుని, దాంతో పాపులర్ అయ్యారు. ఆ విషయమై ఆమె మీడియా తో మాట్లాడుతూ ఏమన్నారో చూద్దాం.

ఆ దెబ్బతో సినిమాలకు దూరమైన గీతాంజలి.. అన్నగారు చెప్పినా వినకుండా..

గీతాంజలి మాట్లాడుతూ...‘‘నిజానికి నా అసలు పేరు ‘మణి’. కానీ నేను చేసిన మొదట సినిమా పేరులో మణి ఉండటంతో నా పేరు మార్చాకోవాల్సి వచ్చింది.  నేను అప్పట్లో తమిళం, మలయాళం, హిందీలో కూడా పనిచేశా. హిందీలో ‘పారస్‌మణి’ నా తొలి సినిమా. బాబూభాయ్‌ మిస్త్రీగారు తీశారు. ఆయన పెట్టిన పేరే ‘గీతాంజలి’, ‘ఇక నుంచి నీ పేరు ఠాగూర్‌ గీతాంజలిగా మారుస్తున్నా’ అని మార్చారు. ఆ పేరు నాకు ఎంతో కలిసొచ్చింది అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక ఆ సినిమా తర్వాత ‘బలరామశ్రీకృష్ణ’ అనే మరో హిందీ సినిమా చేశాం. అందులో సావిత్రిగారు బలరాముడి భార్య. నేను శ్రీకృష్ణుడి భార్య రుక్మిణిగానూ చేశాం. చంద్రకాంత్‌ దర్శకుడు. దారా సింగ్‌, సాహుమోదక్‌లు బలరామకృష్ణులుగా నటించిన ఆ సినిమా బాగా ఆడింది.  ఆ తర్వాత ‘లేతమనసులు’ హిందీలోనూ నా క్యారెక్టర్‌ నేను చేశాను. రీమేక్‌ సినిమా అయినా తెలుగు, హిందీ కన్నడ అన్నింటిలోనూ ఆ పాత్రలు అలాగే ఉండేవి. రోజుకు మూడు షిప్ట్‌లు పనిచేసేదాన్ని’’అని చెప్పారామె.