ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమా ముగింపు విషాదాంతంతో కూడి ఉన్నప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు.. హీరో, హీరోయిన్ల పాత్రలు చనిపోయినా, వాళ్లిద్దరూ క్లైమాక్స్ లో కలవకపోయినా ఒప్పుకునేవారు. కచ్చితంగా హ్యాపీ ఎండింగ్ ఉండాల్సిందే. 

అలా కాకుండా కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తే ఆ సినిమాలు చేదు అనుభవాల్ని మిగిల్చాయి. దీంతో మేకర్స్ కథ ఎలా రాసుకున్నప్పటికీ చివరికి హ్యాపీ ఎండింగ్ ఉండేలా చూసుకునేవారు. ఈ విషయంలోనే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒకప్పుడు మహేష్ బాబు సోదరి మంజులతో గొడవ పడినట్లు తెలుస్తోంది.

హీరో కూతురి లవ్ ఎఫైర్.. దారి తప్పుతోందా..?

ఒరిజినల్ వెర్షన్ 'విన్నైతాండి వరువాయ'తో పోలిస్తే దాని రీమేక్ తెలుగు వెర్షన్ 'ఏమాయ చేసావె' క్లైమాక్స్ భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తమిళంలో హీరో, హీరోయిన్లు చివరకి కలవరు. హీరోయిన్ కి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. హీరో తీసే సినిమాలో మాత్రమే హీరో, హీరోయిన్లు కలుస్తారు. నిజంలో ఎవరి జీవితాలు వారివి.

ఆ కథకి అలాంటి ఎండింగే కరెక్ట్ అనేది గౌతమ్ మీనన్ అభిప్రాయం. కానీ క్లైమాక్స్ అలా ఉంటే తెలుగు ప్రేక్షకులు చూడరని గొడవ చేసి మరీ కథ మార్పించింది మంజుల. ఈ సినిమా విడుదలై పదేళ్లు గడిచిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు గౌతమ్ మీనన్ తనతో బలవంతంగా 'ఏమాయ చేసావె' సినిమా క్లైమాక్స్ మార్పించినట్లు చెప్పారు.

అలా చేయడం వలన తనలో ఉన్న ఫిలిమ్ మేకర్ రాజీ పడిపోయారని.. ఈ మార్పు వలన తెలుగు వెర్షన్ తనకు సంతృప్తినివ్వలేదని అన్నారు. తన దృష్టిలో అసలు అది సినిమానే కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు.  'విన్నైతాండి వరువాయ' మాత్రమే ఒరిజినల్ ఫిల్మ్ అని గౌతమ్ అభిప్రాయపడ్డారు. చై-సామ్ లతో కలిసి పని చేయడాన్ని ఎంతో ఆస్వాదించానని.. కానీ క్లైమాక్స్ మార్చడం వలన తనకు ఈ సినిమా సంతృప్తినివ్వలేదని గౌతమ్ అన్నారు.