టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం RRR. ఈ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే నేడు RRR సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్  అప్డేట్ ఆడియెన్స్ లో అంచనాలను మరింతగా పెంచేసింది.

ఎందుకంటె సినిమాలో మరొక విప్లవకారుడి హ్యాండ్ కూడా పడబోతున్నట్లు సమాచారం. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు. ప్రజా గాయకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన గొంతుని వినిపించిన గద్దర్. ఆయన గతంలో అనేక సినిమాలకు పాటలు రాశారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఆయన పెన్నుకి ఎక్కువగా పని పడలేదు. ఇక చాలా కాలం తరువాత ఒక పవర్ఫుల్ సాంగ్ ని రాయడానికి సిద్ధమయ్యారు. అదికూడా RRR సినిమాకు ఆయన పాట రాయనుండడం విశేషమని చెప్పాలి.

అందుకు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. RRR సినిమా విప్లవ వీరులు కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు జీవితాల ఆధారంగా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వీరుల ధైర్య సాహసాలను పాటలో ప్రతిబింబించేలా గద్దర్ తో దర్శకుడు రాజమౌళి సాంగ్ రాయిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. సాంగ్స్ ని కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ కీరవాణితో దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక గద్దర్ సాంగ్ సినిమాలోనే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం.

RRR ఎఫెక్ట్.. స్టార్ హీరోయిన్స్ కి ఎన్టీఆర్ బ్యూటీ హెచ్చరిక!