వరుణ్ తేజ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం భాక్సాఫీస్ వద్ద బాగానే పాసైపోయింది. పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయినా, నష్టాలు మాత్రం తేలేదు. అదే సమయంలో గోపిచంద్ హీరోగా వచ్చిన చాణక్య చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. సైరా సినిమా మీద పోటీగా విడుదలైన ఈ సినిమా నామరూపాలు లేకుండాపోయి గోపీచంద్ కు పూర్తి నిరాశను మిగిల్చింది.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు డిజిటిల్ మీడియాలో  పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఈ రోజు నుంచే డిజిటల్ మాధ్యమంలో దర్శనమివ్వనున్నాయి. అడివి శేష్ హిట్ సినిమా ఎవరు చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు నవంబర్ 4న వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ హాట్ స్టార్ రాబోతోంది. అలాగే ఈ రోజు గోపిచంద్ చాణక్య చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోంది.

హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

గద్దల కొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాదు కాబట్టి ఈ సినిమాని కూడా జనం పూర్తిగా థియేటర్లలోకి వచ్చి చూడలేదు. కానీ మంచి టాక్ ఉంది కాబట్టి మిగతా జనం ఇప్పుడు డిజిటల్ లో చూస్తారని లెక్కలు వేస్తున్నారు.   చాణక్య చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్...అయినా పెద్ద హీరో గోపీచంద్ నటించిన సినిమా కావటంతో ఓ సారి ఓ లుక్కేద్దాం అని...మెజారిటీ జనం డిజిటల్లోనే చూసేందుకు ప్రయత్నిస్తారు.

ఈ క్రమంలో ఈ రెండు సినిమాలకు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద మంచి క్రేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి తోడు అమెజాన్ ప్రైమ్ వారు పబ్లిసిటీ కూడా ఓ రేంజిలో చేస్తున్నారు. రాబోయే క్రిస్మస్,సంక్రాంతి సినిమాలు సైతం అప్పుడే డిజిటెల్ లో మార్కెట్లో పోటీ ఉన్నాయి. ఏవైనా ఇవి డిజిటల్ పోటీ రోజులు. ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడ క్రేజ్ ని బట్టి కూడా హీరో మార్కెట్ అంచనా వేస్తారు.