మహర్షి సినిమా కథలో కీ రోల్ ఫ్రెండ్ క్యారెక్టర్, ప్రెండ్ షిప్ కోసం అమెరికా నుంచి వచ్చిన అల్లరి నరేష్  పాయింట్ కీలకం అయింది. ఫ్రెండ్ గా అల్లరి నరేష్ జీవించేసి సినిమాకు ఓ స్ట్రెత్ గా నిలిచాడు. ఇప్పుడుమహేష్ బాబు లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరూ లో కూడా అలాంటి కథలో మలుపుని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ మంచి  ఫ్రెండ్ క్యారెక్టర్ వున్నట్లు మీడియా వర్గాల్లో వినపడుతోంది.

సరిలేరు నీకెవ్వరు కథ బేస్ అయ్యేది ఓ ఫ్రెండ్ పాత్ర మీదే అని ఇండస్ట్రీలో చెప్తున్నారు. అంతేకాదు సినిమాలో హీరో పేరు, ఫ్రెండ్ పేరు ఒకటే వుంటాయట.  అంటేఆ ఫ్రెండ్ పేరు కూడా అజయ్ కృష్ణట. మరి ఆ ఫ్రెండ్ పాత్ర ఎవరు వేస్తున్నారో చూడాలి. ఈ సినిమా కథ కొత్తగా ఉండదు కానీ ఫన్ బాగుంటుందని అంటున్నారు.  ఇంతకీ ఆ ఫ్రెండ్ పాత్ర వేసేది మరెవ్వరో కాదట సత్యదేవ్ అని చెప్తున్నారు.

anchor Rashmi: లెస్బియన్ గా మారిన యాంకర్ రష్మి..!

ఛార్మితో చేసిన జ్యోతి లక్ష్మి సినిమా నుంచి త్వరలో  రాబోతున్న 'రాగల 24 గంటల్లో' వరకు సత్య అనేక వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమాలోనూ సత్య హైలెట్ అవుతాడంటున్నారు. మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక హీరోయిన్ గా... చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి... దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై... రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానుంది.