టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల సినిమాకు సంబందించిన క్యాస్టింగ్ తో దర్శకుడు సినిమాపై ఉన్న క్రేజ్ ని మరింత పెంచేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి ఈ సినిమా తరువాత ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఏ దర్శకులతో వర్క్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గరకు వచ్చిన దర్శకులకు ఒక్కమాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారట.

మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు

RRR సినిమా పూర్తయ్యేవరకు దేని గురించి కూడా ఆలోచించనని అప్పటివరకు ఎలాంటి కథలను వినడానికి ఇంట్రెస్ట్ లేదని డైరెక్ట్ గా చేప్పేశాడట. మొన్నటి వరకు బిగిల్ దర్శకుడు అట్లీతో పాటు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తారక్ ని కలిసేందుకు ప్రయత్నం చేశారు. ప్రశాంత్ ఆల్ మోస్ట్ స్టోరీ ఫినిష్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక వైజయంతి మూవీస్ కూడా తారక్ తో సినిమాని ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవ్వగా తారక్ అశ్వినీదత్ తో మాట్లాడి RRR రిలీజ్ వరకు హడావుడి వద్దని క్లారిటీగా చెప్పేశాడట.

ఇక RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వచ్చే ఏడాది జులై 31న సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అప్పటివరకు ఎన్టీఆర్ మరో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపేలా కనిపించడం లేదు. మరి సినిమా రిలీజ్ అనంతరం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న RRR సినిమాను డివివి.దానయ్య 400కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.