ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎలాంటి హైప్ క్రియేట్ చేయకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లారు. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నారు.

డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో లవ్ స్టోరీని వెండితెరపై ప్రెజంట్ చేయనున్నారు. యాక్షన్ డోస్ ఎక్కువ కాకుండా.. మొదటి సినిమాతోనే లవర్ బాయ్ లా బెల్లంకొండ గణేష్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లకు స్కోప్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

బెల్లంకొండ తమ్ముడి లవ్ ట్రాక్.. అన్నలా కాకుండా?

దర్శకుడు తేజ పరిచయం చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్, 'మజిలీ' ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ అనన్య అగర్వాల్, మిస్ ఇండియా ఫైనలిస్ట్ నటాషా సింగ్ చౌహాన్ లను హీరోయిన్లుగా 
ఫైనల్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్లను తీసుకోనున్నారు.

 

అలానే సినిమా స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే, కియరా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. బెల్లంకొండ సురేష్ తన కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి ఎంతైనా ఖర్చు పెడతాడు. తన పెద్ద కొడుకు డెబ్యూ ఫిలిం కోసం వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ ని, హీరోయిన్ గా సమంతని, స్పెషల్ సాంగ్ కోసం తమన్నాని తీసుకొచ్చాడు. ఇప్పుడు తన చిన్న కొడుకు విషయంలో కూడా తక్కువేమీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.