బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు శ్రీనివాస్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఫైనల్ గా ఇటీవల రాక్షసుడు సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా శ్రీనివాస్ సినిమాలకు బడ్జెట్ లిమిట్స్ ఏ మాత్రం ఉండవు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. 

ఇక ఇప్పుడు రెండవ కుమారుడి విషయంలో మాత్రం అలాంటి హైప్ క్రియేట్ చేయకుండా కథకు అవసరమైన రీతిలో ఖర్చు చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని సురేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది. అన్నలా కాకుండా డిఫరెంట్ జానర్ లో తన ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. 

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమాలో పిరియడ్ డ్రామా కాన్సెప్ట్ ని టచ్ చేస్తున్నట్లు టాక్. ప్రధాన తారాగణం మధ్య డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో లవ్ స్టోరీని ప్రజెంట్ చేయనున్నారట. యాక్షన్ డోస్ ఎక్కువ కాకుండా మొదటి సినిమాతో ఒక లవ్ బాయ్ లా గణేష్ ఎంట్రీ ని ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇక సినిమాకు సంబందించి టైటిల్ ను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.