స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది.

ఆదివారం నాడు విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటినుండే హంగామా మొదలుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమాని స్పెషల్ షోలు వేసుకునే పర్మిషన్ రావడంతో ఆదివారం నాడు తెల్లవారుజాము నుండే బన్నీ సందడి మొదలుకానుంది.

'సరిలేరు నీకెవ్వరు': కేరళలో మహేష్ న్యూ రికార్డ్

ఇక ఓవర్సీస్ లో శనివారం నాడే ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమా తొలి షో పడేది ఎక్కడ అనే చర్చ మొదలైంది. అయితే తొలిషో పడేది మలేషియాలో అని తెలుస్తోంది. మలేషియాలోనే ఫెడరల్ సినిమాస్ లో ఈ సినిమా తొలిషో పడనుంది.

శనివారం నాడు సాయంత్రం 7 గంటలకు ఫెడరల్ సినిమాల్లో 'అల.. వైకుంఠపురములో' మొదటి షో ప్రారంభం కానుంది. అధికారికంగా మొదటిషో పడేది అక్కడే.. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సుశాంత్, నివేదా పేతురాజ్, జయరాం, టబు లాంటి నటులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.