టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి మినిమమ్ బాక్స్ ఆఫీస్ ఫైట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేనంతగా ప్రిన్స్ కెరీర్ లోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా దేశమంతా అత్యధిక లొకేషన్స్ లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన బజ్ అయితే బాగానే ఉంది. సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేరళలో కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా 30కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. మొదట ఆ రికార్డ్ ని మహేష్ అందుకోబోతున్నాడు. శనివారం ఉదయం 6గంటల నుంచే అక్కడ షోలు మొదలుకానున్నాయి.  ఇక అమెరికాలో జనవరి 10 మధ్యాహ్నం నుంచే 'సరిలేరు నీకెవ్వరు' ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.

ప్రస్తుతం సినిమాకు సంబందించిన బజ్ చూస్తుంటే మహేష్ మొదటిరోజే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మహేష్ గత సినిమాలు ఈజీగా 1మిలియన్ డాలర్స్ ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో సరిలేరు నీకెవ్వరు లక్షల డాలర్లను రాబట్టినట్లు సమాచారం. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుండడం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి.

సంక్రాంతి సీజన్ లో ప్రవాసులు మహేష్ సినిమాను అమితంగా ఇష్టపడతారు. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో సరిలేరు నీకెవ్వరు కోసం ఎగబడుతున్నారు. సినిమా 1.5మిలియన్ డాలర్స్ ని ప్రీమియర్స్ ద్వారానే అందుకోవచ్చని టాక్. ఇక మొదటిరోజు ఈ సీనిమా మొత్తంగా 25కోట్ల షేర్స్ ని అందుకునే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.