బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్ ఇటీవల ఎక్కువగా వార్తలలో నిలిచింది. సాధారణంగా అనారోగ్యానికి గురైన వారిపై జాలి ఉంటుంది. కానీ కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే దేశం నలువైపుల నుంచి ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి కారణం ఆమె నిర్లక్ష్య ధోరణే. 

కనికా లండన్ లో  కరోనా అంటించుకుని ఇండియాకు వచ్చింది. అప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై ప్రజలని హెచ్చరిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు తమ కు రిపోర్ట్ చేసి క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. కానీ కనికా మాత్రం ప్రభుత్వానికి తెలపకుండా లండన్ నుంచి వచ్చాక ఇష్టం వచ్చినట్లు తిరిగింది. దాదాపు 400 మందితో కలసి పార్టీలో పాల్గొంది. 

క్వారంటైన్ లో నిహారిక హాట్ ఫోజులు.. నెటిజన్ల కామెంట్స్ చూశారా

ఆ పార్టీలో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే తనయుడు దుశ్యంత్ కూడా పాల్గొన్నాడు. కనికాకు కరోనా పాజిటివ్ అని తేలగానే దుశ్యంత్, వసుంధర ఇద్దరూ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. కనికా వల్ల ఇంత హంగామా జరిగింది. ప్రస్తుతంకనికా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.

ఆమె చికిత్స ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు కనికాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఆమె ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు కనికా కోలుకున్నారు. తాజాగా ఆమె రిపోర్ట్స్ లో కరోనా నెగిటివ్ అని తేలింది. దీనితో ప్రస్తుతం కనికా కుటుంబ సభ్యులు సంతోషంలో ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు ఆమెని పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తోంది.