సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అలనాటి సూపర్‌స్టార్‌, మహేశ్‌ తండ్రి కృష్ణ తళుక్కున మెరవనున్నారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా  జనవరి 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. మహేష్ అభిమానులు ..దూకుడు వంటి మెగా హిట్ చిత్రం ఈ సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫిల్మ్ నగర్ టాక్ బయిటకు వచ్చింది.  ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ బాగా వచ్చింది. ఫస్టాఫ్ లో వచ్చే ఈ ఎపిసోడ్....రవితేజ వెంకీని గుర్తు చేసినా ..ఫన్ లో ఫస్ట్ క్లాస్ గా ఉంటుందని అంటున్నారు.

'అల వైకుంఠపురములో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

అలాగే యాక్షన్ బ్లాక్ లు సైతం దుమ్ము దులిపేలా వచ్చాయని, కొన్ని చోట్ల మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక్కడును గుర్తు చేస్తుందని అంటున్నారు. అయితే ఎఫ్ 2 లెవిల్ కామెడీ మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దని అంటున్నారు. మహేష్ సినిమాలో ఏ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో లెక్క చూసుకుని మరీ అనీల్ రావిపూడి నింపాడని, సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ సినిమా అవుతుందని అంటున్నారు.

మరీ ముఖ్యంగా విజయశాంతి, మహేష్ మధ్యన ఎమోషన్ సీన్స్ సెకండాఫ్ లో హైలెట్ అవుతాయని చెప్తున్నారు. అయితే సినిమాలో కామెడీకు, యాక్షన్ కు ఇచ్చిన ప్రయారిటీ రొమాన్స్ కు ఇవ్వలేదని, ఆ ఎపిసోడ్స్ సాదాగా సాగిపోతాయని చెప్తున్నారు. ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చే ఈ చిత్రం సంక్రాంతి ఎడ్వాంటేజ్ ని బాగా వినియోగించుకుంటుందని చెప్తున్నారు. అలాగే ఒక రోజు తేడాలో వస్తున్న అల వైకుంఠపురములో... సినిమాకు గట్టి పోటీ ఇస్తుందని చెప్తున్నారు. అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో..’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.