ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ....సితారా ఎంటర్టైన్మెంట్స్ కు మధ్య అగ్గి రాజుకునేలా ఉంది. దిల్ రాజు మొదట నుంచీ సితారా ఎంటర్టైన్మెంట్స్,హారికా బ్యానర్  పై నిర్మించే చిత్రాలకు నైజాం ఏరియాకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్. రీసెంట్ గా వచ్చిన అలవైకుంఠపురములో సైతం ఆయనే నైజాం, వైజాగ్ ఏరియాలు డిస్ట్రిబ్యూట్ చేసారు. అయితే ఇప్పుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సీన్ లోకి ఎంటర్ అవటంతో సమస్యలు వచ్చినట్లు సమాచారం.

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సైతం నైజాం ఏరియాలో పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఆయన ఇప్పుడు తన కుమారుడు హీరోగా రూపొందుతున్న భీష్మ చిత్రం రైట్స్ వైజాగ్ ఏరియాకు డిమాండ్ చేస్తున్నారు. దాంతో రెగ్యులర్ గా ఈ బ్యానర్ వచ్చే సినిమాలు వైజాగ్ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజుకు గండిపడినట్లైంది. కానీ ఈ సినిమాకి నితిన్ హీరో కావటంతో నిర్మాతకు ఎటూ చెప్పలేని పరిస్దితి. నితిన్ తండ్రి సుధాకరెడ్డి ఎట్టి పరిస్దితుల్లోనూ భీష్మ సినిమాను తమ గ్లోబుల్ సినిమా ఫర్మ్ ద్వారానే రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మంచి రేటుని ఆఫర్ చేస్తున్నారు.

ఆ హీరో బెడ్ పై ఉంటే ఏం చేస్తావ్..? నటికి షాకింగ్ ప్రశ్న!
 
నైజాం, వైజాగ్ కలిపి భీష్మ సినిమాకు దిల్ రాజు...ఎనిమిదిన్నర కోట్లు ఆఫర్ చేసారు. అయితే వైజాగ్ ప్రక్కన పెట్టి నైజాం ఏరియాని ఆరున్నర కోట్లకు ఇస్తామని నిర్మాతలు ఎగ్రిమెంట్ చేసుకుందామని చెప్పినట్లు సమాచారం. అయితే దిల్ రాజుకు ఇది నచ్చటం లేదట. ఇస్తే రెండు ఏరియాలు కలిపి ఇవ్వమని పట్టుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. వైజాగ్ ఏరియా ఇప్పుడు ఇద్దరి డిస్ట్రిబ్యూటర్స్ మధ్య పోటీగా మారింది. అయితే ఈ విషయంలో నితిన్ ఏమీ చెప్పలేకపోతున్నాడట. నితిన్ ..గతంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేసి ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణం విషయంలో దిల్ రాజు బాగా నష్టపోయారు. దాంతో నితిన్ కు అటు తండ్రి, ఇటు తన వల్ల నష్టపోయిన నిర్మాత అన్నట్లు ఉంది.

నితిన్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా ‘ఛ‌లో’ ఫేమ్ వెంకీ కుడుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్ర టీజ‌ర్‌ ఇప్పటి విడుదల చేశారు. 2018లో రెండు సినిమాలు చేసిన నితిన్‌, 2019లో సినిమాలేవీ చేయ‌లేదు. దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ముందుగా ‘భీష్మ’ విడుద‌ల కానుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.