స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే అభిమానుల హడావుడి  ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అక్కడ స్టార్ హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక రేంజ్ ని బట్టి హీరోలకు అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజయితే ఆ కిక్కే వేరు.

ఈ నెల 9న దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు  భారీగా నెలకొన్నాయి. ఇక తమిళనాడులో దర్బార్  లావా రేంజ్ లో హీటెక్కుతోంది. మునుపెన్నడు లేని విధంగా అత్యధిక లొకేషన్స్ లో దర్బార్ గ్రాండ్ గా విడుదల కానుంది. మెయిన్ గా చెన్నై లో కొన్ని ప్రయివేట్ సంస్థలు స్పెషల్ గా హాలిడేస్ ప్రకటించడం విశేషం.

బండ్ల గణేష్ నెక్స్ట్ టార్గెట్ అదేనా.. పబ్లిక్ గా కామెంట్స్!

మరికొన్ని సంస్థలైతే ఏకంగా.. ఉద్యోగులకు టికెట్లు ఉచితంగా ఇవ్వడం విశేషం.  ఇవన్నీ ఒక ఎత్తైతే.. అభిమాన సంఘాలు చేసిన ఒక స్పెషల్ ప్లాన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ సినిమా థియేటర్స్ పై హెలి కాప్టార్ ద్వారా పూల వర్షం కురిసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ వ్యవహారమంతా చూస్తుంటే సినిమా ఓపెనింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

కతమిళనాడులో అంతగా వైరల్ అవుతున్న దర్బార్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా సందడి చేయడం లేదు. ఎందుకంటె రజిని గత సినిమాలన్నీ కూడా తెలుగులో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఈ సారి వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తెలుగు ప్రజలని కాస్త ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరీ ఇప్పుడైనా రజిని సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.