'ఛలో' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక ఆ తరువాత 'గీత గోవిందం' సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీంతో అమ్మడికి టాలీవుడ్ అవకాశాలు పెరిగిపోయాడు. నిజానికి రష్మిక గ్లామర్ పరంగా వీక్ అయినప్పటికీ ఆమె అదృష్టం కారణంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళంలో రష్మిక ఛాన్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోంది. అలానే నితిన్ తో ఓ సినిమా చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా అమ్మడి చేతిలో ఉన్నాయి. అయితే కొద్దిరోజులుగా రష్మికకి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఆమెకి బాగా పొగరని, రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తుందని పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'RRR': ఎన్టీఆర్, చరణ్ లకు నెలకి పదిలక్షలు!

కావాలనే కొందరు తనను టార్గెట్ చేస్తూ ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారంటూ రష్మిక తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించింది. అయినప్పటికీ ఈ రకమైన ప్రచారాలు ఆగడం లేదు. తాజాగా ఆమె గురించి జరుగుతోన్న ప్రచారం ఏంటంటే.. దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య హీరోగా రూపొందాల్సిన సినిమాలో రష్మికని హీరోయిన్ గా ఫైనల్ చేయగా.. ఆమె చైతు కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

 

దిల్ రాజు ఈ సినిమాను ఆపేయడానికి కారణాల్లో రష్మిక రెమ్యునరేషన్ కూడా ఒకటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా ఆగిందా లేదా..? అనే సంగతి పక్కన పెడితే.. రష్మిక.. చైతు కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసిందనే విషయం మాత్రం నమ్మే విధంగా లేదు. ఎందుకంటే ప్రస్తుతం చైతు రెమ్యునరేషన్ నాలుగు నుండి ఐదు కోట్ల మధ్యలో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి కోటిన్నర నుండి రెండు కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తున్నారు.

పూజా హెగ్డే లాంటి హీరోయిన్లకి రూ.2 కోట్లకు అటు ఇటుగా ఇస్తుంటే.. రష్మిక రూ.4 కోట్లకు పైగా డిమాండ్ చేసిందంటే నమ్మేలా లేదు. ఇలాంటి ప్రచారాలు చూస్తుంటే మాత్రం రష్మికని ఎవరో కావాలనే టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారనేది నమ్మక తప్పదనిపిస్తోంది.