గత కొన్నేళ్లలో సంక్రాంతి కానుకగా వచ్చిన కొన్ని మీడియం రేంజ్ ఫ్యామిలీ సినిమాలు అంచనాలను మించిన విజయం సాధించాయి. 2016లో 'సోగ్గాడే చిన్ని నాయనా', 2017 సంక్రాంతికి వచ్చిన 'శతమానం భవతి', గతేడాది వచ్చిన 'ఎఫ్ 2' సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.

మిగతా సంక్రాంతి సినిమాలతో పోలిస్తే వీటిపై అంచనాలు తక్కువే.. కానీ ఈ ఫ్యామిలీ సినిమాలు అంచనాలకు అందని రీతిలో భారీ విజయం సాధించాయి. తమ 'ఎంత మంచి వాడవురా' సినిమా కూడా ఈ సంక్రాంతికి అలాంటి మ్యాజిక్కే చేస్తుందని దాని మేకర్స్ అంచనా వేసి ఉండొచ్చు.

‘అల... వైకుంఠపురములో..’ ఫిల్మ్ నగర్ టాక్!

అందుకే భారీ సినిమాలు రేసులో ఉన్నా.. పోటీ బలంగా ఉన్నా.. ధైర్యం చేసి తమ సినిమాని బరిలోకి దింపుతున్నారు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్లను బట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు సతీష్ వేగ్నేస గతంలో 'శతమానం భవతి'తో సంక్రాంతికి భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడేమో 'ఎంత మంచి వాడవురా' సినిమాతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు.

అక్కడవరకు బాగానే ఉంది కానీ హీరో కళ్యాణ్ రామ్ తో ఓ సమస్య ఉంది. ఇప్పటివరకు అతడు ఎక్కువగా మాస్ ఎంటర్టైనర్ చిత్రాలే చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో అతడికి పెద్దగా ఫాలోయింగ్ లేదు. కొన్ని ఫ్యామిలీ కథలతో సినిమాలు చేసినా.. అవి వర్కవుట్ కాలేదు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా ఫ్యామిలీ టచ్ ఉంది. మరి ఆ సినిమాలను దాటి కళ్యాణ్ రామ్ సినిమా నిలబడాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. మరి ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!