పూరి జగన్నాధ్ వరుస పరాజయాలకు ఈ ఏడాది బ్రేక్ పడింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూరి జగన్నాధ్ ఈ చిత్రంతో మ్యాజిక్ చేశాడు. మునుపెన్నడూ చూడని విధంగా రామ్ ని రఫ్ లుక్ లో ప్రజెంట్ చేశారు. ఇక హీరోయిన్లని అందంగా చూపించడంలో పూరి సిద్ధహస్తుడు. 

ఇస్మార్ట్ శంకర్ మూవీలో యంగ్ బ్యూటీలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఇద్దరూ ఈ చిత్రంలో గ్లామర్ తో అదరగొట్టారు. మాస్ ప్రేక్షకుల నుంచి ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇంతమంచి రెస్పాన్స్ వచ్చిందంటే అందుకు నిధి, నభా గ్లామర్ కూడా ఓ కారణం. 

ప్రస్తుతం పూరిజగన్నాధ్ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో ఓ చిత్రానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఫైటర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. 

కానీ పూరి జగన్నాధ్ మాత్రం క్లారిటీగా ఉన్నాడట. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నే ఫైటర్ మూవీకి హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిధిని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా నిధి అగర్వాల్ గోవాలో పూరి జగన్నాధ్, ఛార్మితో కలసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

పూరి నెక్ట్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వస్తున్న వార్తలకు ఈ ఫోటో బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు పూరి తనయుడు ఆకాష్ నటిస్తున్న రొమాంటిక్ మూవీలో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేస్తోందని అందుకే గోవాలో కనిపించదనే వాదనలు కూడా ఉన్నాయి.