రౌడీ హీరో విజయ్ దేవరకొండ మళ్ళీ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన చివరి రెండు చిత్రాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తీవ్రంగా నిరాశపరిచాయి. విజయ్ దేవరకొండ ఒకే రకమైన ప్రేమ కథా చిత్రాల్లో నటిస్తున్నాడనే విమర్శలు ఎదురయ్యాయి. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. పూరి తనదైన స్టైల్ లో ఈ చిత్రాన్ని యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇమేజ్ చూసి యంగ్ బ్యూటీలంతా అతడితో నటించేందుకు సిద్ధం అయ్యారు. 

కానీ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేని ఎంపిక చేశాడు. ప్రస్తుతం విజయ్, అనన్య మధ్య కీలకమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. కాగా పూరి జగన్నాధ్ అనన్య కంటే ముందుగా కొందరు బాలీవుడ్ హీరోయిన్లని ఈ చిత్రం కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. 

బీర్ బాటిల్ తో దాడి.. బిగ్ బాస్ రాహుల్ రియాక్షన్ ఇది!

జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండతో కలసి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. గ్లామర్ షోతో రెచ్చిపోతున్న దిశా పటానీని కూడా పూరి సంప్రదించాడట. కానీ ఈ చిత్రానికి దిశా నో చెప్పినట్లు తెలుస్తోంది. 

దిశా పటాని గతంలో పూరి దర్శత్వంలో లోఫర్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. బహుశా అందువల్లే దిశా పటాని మరోసారి పూరి దర్శత్వంలో నటించడానికి ఒప్పుకోలేదేమో. లోఫర్ తర్వాత దిశా పటాని మరో తెలుగు చిత్రంలో నటించలేదు.