స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించింది. ఇక ఈ చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్ అయితే దేశవ్యాప్తంగా చిన్నపాటి ప్రకంపనలే రేపుతోంది. దక్షణాదితో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీలని కూడా ఫిదా చేస్తోంది. 

ఇప్పటికే బుట్టబొమ్మ సాంగ్ పై మంజు వారియర్, శిల్పా శెట్టి లాంటి సెలెబ్రిటీలంతా స్పందించారు. తాజాగా అందాల మెరుపు తీగ దిశా పటాని కూడా బుట్టబొమ్మ సాంగ్ పై స్పందించింది. ముఖ్యంగా ఈ సాంగ్ లో బన్నీ వాలుగా ఉన్న ప్రదేశం నుంచి డాన్స్ చేయడంతో దిశా పటాని ఆశ్చర్యపోయింది. 

మోహన్ బాబుకు పవన్ కౌంటర్.. ఎందుకు అలా మాట్లాడారో ఇప్పటికీ క్వశ్చన్ మార్క్

సోషల్ మీడియా వేదికగా దిశా పటాని స్పందిస్తూ.. బన్నీ ఇదెలా సాధ్యం నీకు అని ప్రశ్నించింది. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ.. నేను మ్యూజిక్ ని ప్రేమిస్తాను.. ఆ సంగీతమే నా చేత డాన్స్ చేయిస్తుంది. మీ ప్రశంసలకు థాంక్స్ అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. 

దిశా పటాని తెలుగులో నటించిన ఏకైక చిత్రం లోఫర్. ఆ చిత్రం తర్వాత దిశా బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఇంస్టాగ్రామ్లో హద్దులు దాటే అందాల ఆరబోత తప్ప..దిశా పటానికి సరైన అవకాశం దక్కడం లేదు. బన్నీ కూడా బాలీవుడ్ చిత్రాల్లో నటించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అదృష్టం కలసి వస్తే బన్నీ బాలీవుడ్ డెబ్యూ మూవీలో దిశానే హీరోయిన్ కావొచ్చేమో.