ప్రేమికుల దినోత్సవం రోజున తమ ప్రేయసికో, ప్రియుడికో గిఫ్ట్స్ బహుకరించడం సహజమే. చిత్ర పరిశ్రమలో ప్రేమ జంటలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్ లో ప్రేమ జంటలు ఎక్కువగానే ఉన్నాయి. చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, హాట్ బ్యూటీ దిశా పటాని. 

భాగీ 2 చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. అంతకు ముందు నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తమ ప్రేమ గురించి మాత్రం ఈ జంట సీక్రెట్ మైంటైన్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. 

అప్పుడప్పుడూ చెబుతున్న సంగతులు మాత్రమే వీరి మధ్య ప్రేమని తెలియజేస్తున్నాయి. చెట్టాపట్టాలేసుకు తిరగడం, వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలతో దిశా పటాని, టైగర్ ష్రాఫ్ రచ్చ చేస్తూ వచ్చారు. తాజాగా దిశా పటాని టైగర్ ష్రాఫ్ ఇంటికి వాలంటైన్స్ డే గిఫ్ట్ పంపింది. కానీ ఆ గిఫ్ట్ ని మాత్రం టైగర్ ష్రాఫ్ తల్లి రిసీవ్ చేసుకుంది. 

నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది.. రూమర్స్ పై రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్

దిశా పటాని పంపిన గిఫ్ట్ ని టైగర్ తల్లి అయేషా ష్రాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దిశా పటాని పంపిన అందమైన పుష్ప గుచ్చాన్ని పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. 'క్యూటెస్ట్ వాలంటైన్స్ డే.. థాంక్యూ దిషు' అని అయేషా ష్రాఫ్ కామెంట్ చేసింది. దీనికి థాంక్యూ ఆంటీ అని దిశా పటాని బదులిచ్చింది. టైగర్ ష్రాఫ్ తో మాత్రమే కాదు.. అతడి ఫ్యామిలీతో కూడా దిశా బాగా కలిసిపోయింది. 

గత ఏడాది దిశాని టైగెర్ ష్రాఫ్ తో ప్రేమ గురించి ప్రశ్నించగా.. అతడిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ సరదాగా బదులిచ్చింది.