నటి రేణు దేశాయ్ కేంద్రంగా మరోసారి రూమర్స్ వినిపించాయి.  కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తో పాటు తన పిల్లల కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. పిల్లలు ఎదుగుతుండడంతో వారి కెరీర్ కోసం, హైదరాబాద్ లో ఉండడం కోసం పవన్ కళ్యాణ్ ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. 

దీనిపై రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. రేణు దేశాయ్ మునుపెన్నడూ లేని విధంగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 'గత కొన్ని రోజులుగా నా స్నేహితుల నుంచి, మీడియా నుంచి ఓ వార్త తెలుసుకున్నా. వారు చేస్తున్న ఫోన్ కాల్స్, మెసేజ్ లు చూసి నేను తప్పక స్పందించాల్సిన సీరియస్ విషయం అని అర్థమైంది. అందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. 

ఒక వ్యక్తిని నిజమైన ఆస్తి తన నిజాయతీ, ఆత్మగౌరవం, అస్తిత్వం అని మీకు తెలియంది కాదు. నేను ఒంటరిగా జీవిస్తూ, మనగడ కోసం పోరాటం చేస్తున్నాను. నేను ఇంతవరకు మా తండ్రి నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సాయం ఆశించలేదు. అది నానా వ్యక్తిత్వం. అయినా కూడా మీరు నా గురించి అన్యాయంగా అసత్యమైన ప్రచారాలు చేస్తున్నారు. 

మీరంతా అనుకున్నట్లు, ప్రచారం జరుగుతున్నట్లు నేను హైదరాబాద్ లో కొన్న ఫ్లాట్ నాకు ఎవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. 

కానీ మీరంతా ఆ ఇంటిని నా మాజీ భర్త కొనిచ్చారని ప్రచారం చేయడం వల్ల నా ఉనికికే ప్రమాదం అనిపించింది. ఇంతవరకు నా మాజీ భర్త నుంచి నేను ఎలాంటి అన్యాయపూరితమైన భరణాన్ని ఆశించలేదు, పొందలేదు. జరుగుతున్న ఈ ప్రచారానికి, నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్లి ఉండదు. 

నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి అసత్య ప్రచారాల వాళ్ళ నా ఆత్మ ఎంతలా ఘోషిస్తుంది ? కనీసం ఒకసారైనా ఆలోచించారా? ఒంటరి తల్లిగా నా జీవిత పోరాటానికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు.. కించపరచకండి. నేను మీతో పంచుకున్న ఈ భాదని సరిగా అర్థం చేసుకోకుండా.. నాకు, నా మాజీ భర్త అభిమానులకు మధ్య గొడవలు సృష్టించవద్దు అని రెండు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.