ఎన్నో ఎక్సపెక్టేషన్స్  పెట్టుకుని చేసిన ‘డిస్కో రాజా’ థియోటర్స్ నుంచి ప్యాక్ అప్ అయ్యింది. పది కోట్లు మార్క్ ని కూడా ఈ సినిమా చేరుకోకపోవటం రవితేజ అభిమానులను నిరాశపరిచింది. అంతేకాదు...ఈ సినిమా తీసేసిన చాలా థియోటర్స్ లో మొన్న సంక్రాంతికి రిలీజైన అలవైకుంఠపురమలో.., సరిలేరు నీకెవ్వరు సినిమాలు వేసారు. అది మరింత ఇబ్బందిగా మారింది. సినిమా ప్లాఫ్ అవటం ఒకెత్తు...ఇలా అంతకు ముందు రిలీజైన సినిమాలును ఆ థియేటర్స్ వేయటం మరో ఎత్తుగా  మారి రవితేజ ను బాధపెట్టింది. సోషల్ మీడియాలో ఈ విషయమై పోస్ట్ లు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది రవితేజ అభిమానులను మరింతగా ఇబ్బంది పెడుతోంది.

సంక్రాంతి సినిమాలకు ఈ అన్ సీజన్ లో కూడా కలెక్షన్స్ రావటం, ఫ్యామిలీలు వస్తూండటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి డిస్కోరాజా హిట్ అయితే...ఆ రెండు సినిమాలు తీసేసి..ఈ సినిమా వేస్తారని అంచనా వేసారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది.

రవితేజతో రెండు సినిమాలు.. నిండామునిగిన నిర్మాత!
 
మరో ప్రక్క ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి చాలా దారుణంగా మారిందంటోంది ట్రేడ్. లాభాలు రాలేదు సరికదా మినిమం పెట్టిన పెట్టుబడి సగం కూడా రికవరీ లేదంటున్నారు. టీజర్ తో ఈ సినిమాకు అంచనాలు పెరగటంతో ఈ సినిమా వరల్డ్ వైజ్ గా  దాదాపు 22 కోట్ల బిజినెస్ చేసారు.

అయితే ఇప్పటి వరకు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేకపోవటం,ఆరు కోట్లు దగ్గరే ఆగిపోవటం డిస్ట్రిబ్యూటర్స్ ని ఆందోళనలో పడేసింది.  ప్రి రిలీజ్ బిజినెస్, శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ కలుపుకొని నిర్మాత సేఫ్ అయ్యాడు కానీ ఈ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం 13 కోట్ల దాకా నష్టపోయారని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.