Asianet News TeluguAsianet News Telugu

రవితేజతో రెండు సినిమాలు.. నిండామునిగిన నిర్మాత!

'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' లాంటి సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, మాస్ హీరో రవితేజ కాంబినేషన్ లో సినిమా కావడంతో కచ్చితంగా హిట్ అవుతుందని డబ్బులు పెట్టారు. 

Disco Raja Producer in Huge Losses
Author
Hyderabad, First Published Jan 31, 2020, 2:52 PM IST

టాలీవుడ్ హీరో రవితేజతో రెండు సినిమాలు తీసిన నిర్మాత రామ్ తాళ్లూరి భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. విదేశాల్లో సంపాదించిన డబ్బుతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ తాళ్లూరి మొదట్లో చిన్న సినిమాలు తీశాడు. ఆ తరువాత రవితేజతో 'నేలటికెట్టు' సినిమా తీశాడు.

'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' లాంటి సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, మాస్ హీరో రవితేజ కాంబినేషన్ లో సినిమా కావడంతో కచ్చితంగా హిట్ అవుతుందని డబ్బులు పెట్టారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ తాజాగా రవితేజ నటించిన 'డిస్కో రాజా' సినిమాపై భారీ పెట్టుబడి పట్టారు.

ఆ సినిమాలో హీరోయిన్ లా చచ్చిపోతా.. మాధవీలతా కామెంట్స్!

ఈ సినిమాకి అయిన ఖర్చు వలనే డెఫిసిట్‌లో విడుదల చేశారు. కానీ ఇప్పుడు తిరిగి బయ్యర్లకు చెల్లించాల్సిన రేంజ్ లో సినిమా ఫ్లాప్ అయింది. ఈ నష్టాల నుండి నిర్మాతని బయట పడేయడానికి రవితేజతో మరో సినిమా ఏదైనా ఉచితంగా చేసి పెడతాడా..? లేదా..? అనేది చూడాలి.

రోజురోజుకి తన మార్కెట్ స్థాయిని తగ్గించుకుంటున్న రవితేజ.. నిర్మాతలకు భారంగా మారిపోయాడు. ఇప్పుడు తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకొని సినిమాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

ప్రస్తుతం రవితేజ.. 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్యపాత్రలో కనిపించనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios