మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన 'డిస్కో రాజా' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వాచ్చింది. తొలిరోజు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

క్రిటిక్స్ నుండి ఈ సినిమా విమర్శలు ఎదురవుతున్నా.. ప్రేక్షకులు మాత్రం సినిమాని ఆదరిస్తున్నారు. ఈ సినిమా రిలీజై ఒక్కరోజు కూడా కాకుండానే పైరసీకి గురైంది. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాలన్నింటినీ పైరసీ చేసి ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు.

'డిస్కో రాజా' ఫస్ట్ డే కలెక్షన్స్!

సంక్రాంతికి విడుదలైన 'అల. వైకుంఠపురములో', సరిలేరు నీకెవ్వరు', 'దర్బార్' సినిమాలను కూడా పైరసీ చేశారు. ఇప్పుడు రవితేజ 'డిస్కో రాజా' కూడా పైరసీకి గురైంది. దీనికి ఎంతగా అడ్డుకట్ట వేద్దామని ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం ఈ పైరసీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప దీనికి బ్రేక్ పడేలా కనిపించడం లేదు.

ఇక 'డిస్కో రాజా' సినిమా విషయానికొస్తే..  ఒక రివేంజ్ స్టోరీకి సైన్స్ ఫిక్షన్‌ను జతచేసి కొత్త ప్రయోగం చేశారు. ఈ సినిమాకి తన పెర్ఫార్మన్స్ తో ప్రాణం పోశారు రవితేజ. వెన్నెల కిషోర్ తో కలిసి మాస్ మహారాజా చేసిన కామెడీ బాగా పండింది.

ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హాప్ లాంటి హీరోయిన్లు కనిపించారు. నటుడి సునీల్ పాత్ర ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ గా ఉందని చెబుతున్నారు.