మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డిస్కో రాజా'. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమాపై విడుదలకు ముందు బజ్ ఏర్పడడంతో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది.

తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఇంకా థియేటర్లలోనే ఉండడంతో 'డిస్కో రాజా'కి సరైన థియేటర్లు దొరకలేదు.

రవితేజ `డిస్కోరాజా` సినిమా రివ్యూ

నైజాంలో అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు కేవలం అరవై మాత్రమే ఇచ్చారని సమాచారం. థియేటర్లు పెద్దగా ఇవ్వనప్పటికీ రవితేజ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం విశేషమనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.3 కోట్ల షేర్ వసూలు చేసింది.

నైజాంలోనే తొలిరోజు కోటి వరకు షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు ఈ సినిమా రూ.22 కోట్ల బిజినెస్ చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించాల్సివుంటుంది.

ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించారు. తన కెరీర్ లో మొదటిసారి రివెంజ్ స్టోరీకి ఫిక్షన్ జోడించిన కథలో నటించారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హాప్ లాంటి హీరోయిన్లు కనిపించారు. సునీల్, వెన్నెల కిషోర్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.