రవితేజ `డిస్కోరాజా` సినిమా రివ్యూ

First Published 24, Jan 2020, 1:30 PM

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఫిక్షన్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే చాలా అపురూపం. అప్పుడెప్పుడో ఆదిత్యా 369,  ఈ మధ్యన అంతరిక్షం, ఇంకా ఇలాంటి రెండో,మూడో మినహాయిస్తే లిస్ట్ తయారు చేయటానికి కూడా పెద్దగా లేవు. దాంతో కొత్తగా ఎక్కడైనా సైన్స్ ఫిక్షన్ సినిమా కనిపిస్తే ఆనందం వేస్తుంది. కాని తీరా చూసాక, సైన్స్ ఫిక్షన్ పేరుతో సైన్స్ ని సామాజిక న్యాయంలా ప్రక్కన పెట్టేయటమే కాక, ఆ ముసుగులో హాలీవుడ్ కాపీ కథో, మరో రొటీన్ తెలుగు కథ చెప్పేసారని అర్దమయ్యి బాధేస్తుంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఈ కొత్త సైన్స్ ఫిక్షన్ ... ఏ మేరకు సైన్స్ కు, ఫిక్షన్ కు, రవితేజ అభిమానులకు న్యాయం చేసిందనేది చూద్దాం. తెలుగులో మరిన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఇది నాందీ వాచకం పలుకుతుందేమో పరిశీలిద్దాం.

ఇదీ కథ రాజా...   కనిపించకుండా పోయిన వాసు (రవితేజ) కోసం ఆయన మనుష్యులు వెతుకుతూంటారు. ఈ లోగా కొంతమంది శాస్త్రవేత్తల బృందానికి ఆయన మంచు గడ్డల మధ్య ఫ్రీజింగ్ కండీషన్ లో కనపడతాడు. వెంటనే అతన్ని తమ ల్యాబ్ కు తీసుకెళ్లి ప్రాణం పోస్తారు. అయితే ఆ క్రమంలో అతని మెమరిని పోగొట్టుకుంటాడు. అసలు తనెవరు...తన గతం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటాడు. అందుకోసం ల్యాబ్ నుంచి తప్పించుకుని జనాల్లోకి వచ్చి... కావాలని ఓ ఎంపీతో గొడవ పెట్టుకుంటాడు.

దాంతో ఆ విషయం వైరల్ అయ్యి...విలన్ బర్మా సేతు ( బాబీ సింహా ) ఎలర్ట్ అవుతాడు. 35 ఏళ్ల క్రితం చనిపోయాడనుకున్న డిస్కోరాజా(రవితేజ) మళ్లీ వచ్చాడని, అతని అంతు చూడాలనుకుంటాడు.హత్య చేయటానికి సిద్దపడతాడు. ఇంతకీ  వాసు, డిస్కోరాజా ఒకరేనా, ఒకే పోలికలతో ఉన్న ఇధ్దరా...డిస్కో రాజాకు, సేతు కు మధ్య ఏం జరిగింది. వాసుకు మళ్లీ గతం వచ్చిందా, అతన్ని మంచు పర్వతాల్లో పడేసింది ఎవరు వంటి విషయాలన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే రాజా...  ఏ జానర్ సినిమా చూసినా ఏముంది గర్వ కారణం...తెలుగు సినిమా సమస్తం...మాస్,రివేంజ్ కథల పరాణయత్వం అన్నట్లు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూంటే. మొదట కాసేపు సైన్స్ , ప్రయోగం అంటూ ఏదో జరగబోతోందని..(టీజర్,పోస్టర్స్ తో ఆసక్తి క్రియేట్ చేసినట్లు) అనిపించాడు. ఆ తర్వాత అసలు కథతో అరపిస్తాడు అనుకుంటే మామూలు రొటీన్ రివేంజ్ కథని అందిస్తాడు.స్టార్స్ చేసే తెలుగు కథ ఎటు తిరిగినా పగ,ప్రతీకారం దగ్గరకు రావాల్సిందే అని నిట్టూర్చేలా చేసాడు.

సినిమా సెటప్ బాగున్నా, రెట్రో స్టైల్లో ప్లాష్ బ్యాక్ సీన్స్ బాగా తీసినా, ఓవరాల్ స్టోరీ లైన్ గా తెలిసిన కథనే మళ్ళీ చెప్తున్నాడనిపించింది. ముఖ్యంగా విలన్ కు, హీరోకి మధ్య ఉండాల్సిన కాంప్లిక్ట్స్ సీన్స్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవటంతో అవి తేలిపోయాయి. రవితేజ వైపు నుంచి కథ నడుస్తుంది ..కానీ అటు వైపు నుంచి మూసేసి స్క్రీన్ ప్లే రాయటంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. రొటీన్ రివేంజ్ అయినా , స్ట్రాంగ్ విలన్ ఉంటే సైన్స్ ఫిక్షన్ ప్రక్కన పెట్టి సినిమాని ఎంజాయ్ చేసే అవకాసం ఉండేది.

రవితేజా రచ్చ ఎలా ఉందంటే..  సాధారణంగా రవితేజ లో కనపడే ఎనర్జీ ఈ సినిమాలోనూ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. అలాగే లుక్ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకోవటంతో బాగున్నాడు. అయితే ఆయన ఎనర్జీకు ఎప్పుడూ అల్లరి తోడయ్యి,ఫన్ తో పరుగులు పెట్టేది. అది ఈ ఇక్కడ మిస్సైంది.సునీల్, వెన్నెల కిషోర్ వంటి వారు ఉన్నా రవితేజకు సరైవ సపోర్ట్ ఇచ్చే సీన్స్ లేవు. అక్కడక్కడా పాత రవితేజ కనిపిస్తాడు అంతే. అయితే ఈ సినిమా కోసం రవితేజ మేన‌రిజ‌మ్స్, డైలాగ్ మాడ్యులేష‌న్‌, క్యారెక్ట‌ర్‌ని ఓన్ విధానం మాత్రం మెచ్చుకోదగ్గది.

డైరక్షన్, మిగతా డిపార్టమెంట్స్ దర్శకుడు విఐ ఆనంద్..తన ప్రతిభ,కాన్సర్టేషన్ మొత్తం డిస్కోరాజా రెట్రో గెటప్,లుక్, ఎట్మాస్మియర్ పై పెట్టారు. కథను పెద్దగా పట్టించుకోలేదు. డైరక్షన్ కూడా సోసో. ముఖ్యంగా ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోయాడు.

మిగతా విభాగాల్లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. సినిమాటోగ్రఫీ సూపర్. ముఖ్యంగా మంచు పర్వతాల సీన్స్ లో ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లు అనిపించింది. ఎడిటింగ్ ఓకే. ఆర్ట్ వర్క్ ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వింటేజ్ లుక్ తీసుకురావటం కోసం చాలా కష్టపడ్డారని అర్దమవుతుంది. డైలాగులు చెప్పుకోదగని లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫైన్.

ఏవి హిట్...  రెట్రో బ్యాక్ డ్రాప్ ప్లాష్ బ్యాక్.. ప్రీ ఇంటర్వెల్స్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ బర్మా సేతుగా బాబి సింహా ఫెరఫార్మెన్స్... తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్... చిరు కట్ అవుట్ సీన్స్.. బాబి సింహాని కార్నర్ చేసే సీన్స్

ఏవి ఫట్.. రొటీన్ రివేంజ్ స్టోరీ.. ఇంట్రస్ట్ కల్పించని స్క్రీన్ ప్లే.. రవితేజ సినిమాలనుంచి ఆశించే కామెడీ లేకపోవటం వీక్ సెకండాఫ్

ఫైనల్ థాట్.. రొట్ట రేవేంజ్ కథని  లాబ్ లో పెట్టి ప్రయోగం చేసినా...కొత్త కాన్సెప్టు అయ్యిపోదు..దాని సహజ లక్షణం పోదు

Rating: 2.5/5

Rating: 2.5/5