ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ‘డిస్కో రాజా’ కూడా తన దారి తను చూసుకుంది. బడ్జెట్ ని,రెమ్యునేషన్ ని తగ్గించుకుని చేసినా రవితేజకు కలిసి రాలేదు. రవితేజ కెరీర్ లో మరో పెద్ద డిజాస్టర్ చిత్రంగా నమోదు అయ్యింది. వారంలోపై డబ్బాలు వెనక్కి వచ్చేసాయి. ఇక ఈ సినిమాని థియేటర్స్ లో ఉంచితే రెంట్ లు దండుగ అని ఎగ్జిబిటర్స్ తీసేసారు. ఫస్ట్ రోజే పెద్దగా ఓపినింగ్స్ రాలేదు. అక్కడ నుంచి నెగిటివ్ టాక్ సినిమాని వెనక్కి లాగేసింది. దాదాపు ఆరు కోట్లు దగ్గర సినిమా ఆగినట్లు సమాచారం.

రవితేజతో రెండు సినిమాలు.. నిండామునిగిన నిర్మాత!

 ఈ క్రమంలో ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి చాలా దారుణంగా మారింది. లాభాలు మాట దేవుడెరుగు మినిమం పెట్టిన పెట్టుబడి సగం కూడా రికవరీ లేదు.  దాంతో ఆ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతపై తమకు రికవరీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా వరల్డ్ వైజ్ గా  దాదాపు 22 కోట్ల బిజినెస్ చేసారు. అయితే ఇప్పటి వరకు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేకపోవటం, ఆరు కోట్లు దగ్గరే ఆగిపోవటం డిస్ట్రిబ్యూటర్స్ ని ఆందోళనలో పడేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్, శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ కలుపుకొని నిర్మాత సేఫ్ అయ్యాడు కానీ ఈ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం 13 కోట్ల దాకా నష్టపోయారని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.

ఖచ్చితంగా ఈ ఒత్తిడి రవితేజ మీద కూడా ఉంటుంది. దాంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు ఏ విధంగా సెటిల్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది. రవితేజ ఇదే బ్యానర్ లో మరో సినిమా చేసి, ఆ రైట్స్ తక్కువ రేటుకు ఇస్తామన్నా నమ్మే పరిస్దితి లేదు. నష్టపోయిన మేరకు సెటిల్ చేయమని కోరుతున్నట్లు సమాచారం. ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.