సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడైతే 'శ్రీమంతుడు' సినిమాలో నటించాడో అప్పటినుండి ఆ ఫీవర్ నుండి బయటకి రావడం లేదు. లుక్స్ పరంగా, క్యారెక్టర్ల పరంగా ఒకేరకంగా కనిపిస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. 'శ్రీమంతుడు', 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్', 'భరత్ అనే నేను', 'మహర్షి' ఇలా ఏ సినిమా తీసుకున్నా.. అన్ని చిత్రాల్లో మహేష్ ఒకలానే కనిపిస్తాడు.

ఈ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు కూడా ఒకేలా అనిపిస్తాయి. హీరో చాలా మంచి వ్యక్తిగా, సమాజం కోసం పాటు పడే వ్యక్తిగా కనిపించడం.. అతడి గొప్పదనాన్ని, ఆశయాల్ని పొగుడుతూ పాటలు పెట్టడం కూడా ఆనవాయితీ అయిపోయింది. వాటిలో మహేష్ లుక్స్, స్క్రీన్ ప్రెజన్స్ కూడా ఒకేలా ఉండడంతో జనాలకు చూసిన సినిమాలే చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతోంది.

హీరోయిన్ శ్రియని పోలీసులు పట్టుకున్నారట!

'మహర్షి' సినిమా సమయంలో అభిమానులు సైతం ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇలా ఒకేరకమైన సినిమాలు చేయడం మానేయమని, హీరోని విపరీతంగా పొగిడే పాటలకు దూరంగా ఉండమని సోషల్ మీడియాలో మహేష్ ని కొందరు అభిమానులు వేడుకున్నారు. ఇలాంటి నేపధ్యంలో మహేష్ తన రొటీన్ కాన్సెప్ట్ లను పక్కన పెట్టి దర్శకుడు అనీల్ రావిపూడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దీంతో ఆడియన్స్ మంచి మసాలా సినిమా చూడబోతున్నామని అనుకున్నారు. కానీ రీసెంట్ గా విడుదలైన 'సూర్యుడివో చంద్రుడివో' అంటూ సాగే పాట చూస్తే గనుక మహేష్ మళ్లీ పాత స్టైల్ లోకి వెళ్లిపోయాడని అనిపిస్తుంది. ఈ పాటలో ఎప్పటిలానే మహేష్ రొటీన్ లుక్స్, నడక, స్క్రీన్ ప్రెజన్స్ తో కాస్త బోర్ కొట్టించాడు. లిరిక్స్ కూడా అంత గొప్పగా లేవు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతోనైనా మహేష్ మారతాడని అనుకుంటే ఇందులో కూడా తన రొటీన్ మేనరిజాన్ని చూపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.