టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి శ్రియకి ఆ తరువాత అవకాశాలు బాగా తగ్గాయి. తెలుగులో ఆమె చివరిగా నటించిన సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ సినిమా తరువాత ఆమె మరో సినిమాకి సైన్ చేయలేదు.

ఇటీవల తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ సినిమాల గురించి ఆలోచించడం కాస్త తగ్గించినట్లుంది. ఇది ఇలా ఉండగా.. శ్రియని లండన్ పోలీసులు పట్టుకున్నారట. ఈ మేరకు వార్తలు వెలువడుతున్నాయి.  ప్రస్తుతం శ్రియ 'సందకారి' అనే సినిమాలో నటిస్తోంది.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఫ్లాప్.. అయితే ఏంటి..?

ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అయితే అక్కడి ఎయిర్ పోర్ట్ లోని ఓ హై సెక్యురిటీ ప్రాంతంలోకి శ్రియ అనుమతి లేకుండా వెళ్లడంతో పోలీసులు గన్ పాయింట్ లో ఆమెని పట్టుకున్నారట. షూటింగ్ అక్కడే జరుగుతుండడంతో శ్రియ సరదాగా చుట్టుపక్కల విహరిస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

విషయం తెలిసి సినిమాలో హీరోగా నటిస్తున్న విమల్ తో పాటు యూనిట్ సభ్యులు పోలీసులతో మాట్లాడి వారికి షూటింగ్ డాక్యుమెంట్స్ చూపించిన తరువాతే పోలీసులు శ్రియని వదిలేశారట. అయితే ఈ విషయంపై శ్రియ కానీ యూనిట్ సభ్యుల నుండి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'మై బాస్' అనే సినిమాకి రీమేక్ గా 
'సందకారి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.