సాహో సినిమాతో ఊహించని విధంగా ప్లాప్ అందుకున్న ప్రభాస్ బాలీవుడ్ ఆడియెన్స్ ని అయితే మెప్పించాడు. సాహో నార్త్ ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక మొత్తానికి నెక్స్ట్ 'జాన్' సినిమాతో సౌత్ ఆడియెన్స్ ని మెప్పించాలని తన రొమాంటిక్ మోడ్ ని ప్రజెంట్ చేయబోతున్నాడు.

గతంలో ఎప్పుడు లేని విధంగా 1965కాలం నాటి ఒక ప్రేమకథతో రెబల్ స్టార్ ప్రయోగం చేస్తున్నాడు.  అయితే సాహో అధిక బడ్జెట్ పెట్టడంతో అనవసరంగా వృధా అయ్యిందని ప్ప్రభాస్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథకు ఎంత అవసరమో అంతే ఖర్చు అయ్యేలా ముందే నిర్మాతలతో డిస్కస్ చేశాడట.

సాహో పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే జాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ బడ్జెట్ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదట. యూరప్ లోని కొన్ని స్పెషల్ లొకేషన్స్ లోనే సినిమా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇక మొదటి షెడ్యూల్ అయిపోగానే సాహో ప్రమోషన్స్ తో బిజీ అయిన ప్రభాస్ జాన్ కి కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక సాహో రిజల్ట్ తో రెబల్ స్టార్ ఆలోచనలు కూడా మారాయి. సెకండ్ షెడ్యూల్ అనంతరం ఇప్పుడు మొత్తం యూరప్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశాడట. బడ్జెట్ తో ప్రయోగాలు అనవసరమని రామోజీ ఫిల్మ్ సిటీలోనే యూరప్ కి సంబందించిన సెట్స్ తో మ్యానేజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట.  

బడ్జెట్ లో కొన్ని మార్పులు చేస్తూ ఉన్నంతలో సెట్స్ ని డిజైన్ చేయించాలని చిత్ర యూనిట్ కూడా ప్రభాస్ సలహాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక రైల్వే స్టేషన్ సెట్ కి మాత్రం గట్టిగా ఖర్చు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.