టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన నటుడు నవదీప్ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలు హిట్టు సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న నవదీప్ కి జనాల్లో క్రేజ్ మరింత పెరిగింది. అతడి కామెడీ టైమింగ్ జనాలను మెప్పించింది.

రీసెంట్ గా ఈ హీరో 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ఓ పాత్ర పోషించాడు. సినిమాలో అల్లు అర్జున్, నవదీప్ కాంబినేషన్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ లో బన్నీ.. నవదీప్ గురించి గొప్పగా మాట్లాడారు. వీరిద్దరూ బయట మంచి స్నేహితులు. ఒకరినొకరు 'బావా' అని పిలుచుకుంటారు.

మహేష్ కౌగిలింతలో అనిల్ రావిపూడి... సరిలేని ఆనందం!

తాజాగా జరిగిన సినిమా థాంక్స్ మీట్ లో కూడా బన్నీ.. నవదీప్ గురించి బాగా మాట్లాడారు. ఇది ఇలా ఉండగా.. నవదీప్ గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆడియన్స్ ని నవ్విస్తున్నాయి. ముందుగా మైక్ తీసుకొని తన చిత్రబృందాన్ని ఒక్కొక్కరుగా గుర్తు చేసుకుంటూ వారి గురించి గొప్పగా మాట్లాడారు త్రివిక్రమ్.

ఈ క్రమంలో నవదీప్ పేరు మర్చిపోయారు. వెంటనే తేరుకొని.. మైక్ తీసుకున్నాడు. ''నవదీప్ గురించి మాట్లాడకపోతే తనేం.. ఫీల్ అవ్వడు.. పాపం మంచోడు.. కానీ మా ఆవిడ మాత్రం ఫీల్ అవుతుందని'' అన్నాడు త్రివిక్రమ్.

తన భార్య, కొడుకు నవదీప్ కి ఫ్యాన్స్ అని.. బిగ్ బాస్ షోలో నవదీప్ ని చూసినప్పటి నుండి అతడిని అభిమానించడం మొదలుపెట్టారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్యారిస్ లో జరుగుతున్నప్పుడు నవదీప్ ని చూడడం కోసమే తన భార్య ప్యారిస్ వచ్చిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.