టాలీవుడ్ లో ప్రతిభగల దర్శకులలో తేజ ఒకరు. జయం, నువ్వు నేను లాంటి ప్రేమ కథా చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్న తేజ.. నిజం లాంటి సందేశాత్మక చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. దాదాపు దశాబ్దకాలం పాటు తేజకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. 

2017లో నేనే రాజు నేనే మంత్రి చిత్రం విజయం సాధించడంతో తేజ పుంజుకున్నారు. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత తేజ తెరకెక్కించిన చిత్రం సీత. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో మళ్ళీ తేజకు సమస్యలు మొదలయ్యాయి. 

తదుపరి చిత్రం కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలని డైలమాలో తేజ పడ్డాడు. ఇటీవల కొన్ని రోజులుగా తేజ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. తేజ ఆర్టికల్ 370 రద్దు అంశంపై చిత్రం తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరిగింది. జమ్ము కాశ్మీర్ ని పూర్తిగా ఇండియాలో అంతర్భాగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించింది. 

ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై స్వర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్నే తేజ సినిమాగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించబోతున్నట్లు తాజా సమాచారం. 

హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ కొట్టిన మురుగదాస్

గోపిచంద్ కూడా ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. దీనితో తేజ కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ చివరగా నటించిన చిత్రం చాణక్య. టెర్రరిజం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ నిరాశపరిచింది. మరి ఆర్టికర్ 370 నేపథ్యంలో తేజ తెరకెక్కించబోయే చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. తేజ దర్శకత్వంలో గోపీచంద్ గతంలో జయం, నిజం చిత్రాల్లో విలన్ గా నటించాడు.