కరోనా వైరస్.. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. చైనా నుండి ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా పాకుతోంది. ఇండియాలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు.

అతడిని గాంధీ హాస్పిటల్ కి తరలించి ప్రత్యేక వార్డ్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ కి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

ఫ్రాన్స్ కి బయలుదేరిన ప్రభాస్.. అక్కడ వందల మందికి కరోనా!

''డియర్ వైరస్.. సైలెంట్ గా అందరినీ చంపుకుంటూపోతుంటే నువ్ కూడా చచ్చిపోతావ్ అనే విషయం తెలుసుకో.. ఎందుకంటే నువ్ కూడా ఓ పారాసైట్ వే. నీకు నమ్మకం లేకపోతే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకో.. నీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే.. నువ్ బతుకు, మమ్మల్ని బతకనివ్వు. నీకు బుద్ది వస్తుందని భావిస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

వైరస్ కి ట్విట్టర్ అకౌంట్ లేదని.. కావాలంటే హాస్పిటల్ కి వెళ్లి డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు. నిన్న రాత్రి కూడా వర్మ సోషల్ మీడియాలో.. ఇంతకాలం ఎన్నో చైనీస్ వస్తువులను ఉపయోగించాం.. ఇప్పుడు చావు కూడా చైనాదేనా అంటూ కామెంట్ చేశారు.