'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. అమ్మడుకి టాలీవుడ్ లో మాత్రం మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో నభా తెలంగాణా అమ్మాయిగా కనిపించింది. ఆమె తెలంగాణా యాసతో 
చెప్పే డైలాగులకు కుర్రాళ్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్ గా ఈ బ్యూటీ కోటి పెట్టి లగ్జరీ కారు కొనుక్కుంది. ఈ కారు వెనుక చిన్న స్టోరీ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుక్కోమని నభా నటేష్ కి సలహా ఇచ్చారట. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనుక్కోమని.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి ఫేమస్ కాబట్టి భవిష్యత్తులో రేట్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని నభాతో చర్చించారట.

అంతేకాదు.. వాస్తు నిపుణులతో మాట్లాడి తన జాతకానికి సెట్ అయ్యే లొకేషన్ ని సూచించాలని ప్రత్యేక శ్రద్ధ చూపించారట. ఇంతా చేస్తే.. నభా మాత్రం ఆ మాటలు పెడచెవిన పెట్టిన కోటి పెట్టి కారు సొంతం చేసుకుంది. ఇంటి కంటే కారు కొనుక్కుంటే  క్రేజ్ బాగుంటుందని.. వార్తలలో నిలిచే ఛాన్స్ ఉంటుందని అమ్మడు ఆలోచన చేసిందట. అందుకే తన భారీ హిట్ ఇచ్చిన దర్శకుడి మాట కూడా వినకుండా సొంత నిర్ణయం తీసుకుంది.

'ఇస్మార్ట్ బ్యూటీ' నభా నటేష్ కొత్త కారు అదిరిందిగా..!

ఆ కారుతో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. పూరి చెప్పినట్లుగా ఇల్లు కొన్నుక్కుంటే ఫ్యూచర్ లో నభాకి ఉపయోగకరంగా ఉండేది. కార్ల మీద పెట్టుబడి పెట్టినా దాని వాల్యూ రోజురోజుకి తగ్గిపోతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రస్తుతం నభా.. రవితేజ సరసన 'డిస్కో రాజా' సినిమాలో నటిస్తోంది. అలానే సాయి ధరం తేజ్ నటించనున్న 'సోలో లైఫే సో బెటర్' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. మొత్తానికి ఈ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.