సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా..? అని స్టార్ డైరెక్టర్లు సైతం ఎదురుచూస్తుంటారు. కానీ అలాంటి ఛాన్స్ ని కావాలనే వదులుకున్నాడట దర్శకుడు మారుతి. గతంలో సుధీర్ బాబు హీరోగా మారుతి 'ప్రేమ కథా చిత్రమ్' అనే సినిమా తీశాడు. అది సెన్సేషనల్ హిట్ అయింది.

సుధీర్ కెరీర్ మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అదే. ఆ సినిమా చూసిన మహేష్ ఇంప్రెస్ అయ్యాడు. అప్పట్లో ఈ సినిమా గురించి ఒక ట్వీట్ కూడా పెట్టాడు. అంతేకాదు.. మారుతి పనితీరు నచ్చి చెక్ ఇప్పించి తన కోసం కథ రాయమని చెప్పాడట. ఈ విషయాన్ని మారుతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

అర్ధరాత్రి నుండే 'సరిలేరు నీకెవ్వరు' షోలు!

అయితే మహేష్ అలా అడ్వాన్స్ ఇచ్చినా కూడా మారుతి ఆయన కోసం కథ రాయలేదట. సినిమా చేసే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది. దానికి కారణం వివరించాడు మారుతి. మహేష్ స్థాయి హీరోతో సినిమా అంటే మాములు విషయం కాదని.. ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉంటాయని,, అంత ఒత్తిడిని తీసుకోగలనా..? అనే సందేహంతో కథ రాయలేదని మారుతి చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్ కూడా తనతో సినిమా చేయమని అడిగాడని.. అయితే అలాంటి స్టార్ హీరోలతో సినిమా అంటే బడ్జెట్ ఎక్కువ ఉంటుందని.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని.. ఇంతకముందు ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదని.. ఇప్పుడు వచ్చిందని మారుతి చెప్పుకొచ్చాడు.

తాజాగా మారుతి డైరెక్ట్ చేసిన 'ప్రతిరోజూ పండగే' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాతో ఎంతమంది ఆర్టిస్ట్ లనైనా.. హ్యాండిల్ చేయగలననే నమ్మకం వచ్చిందని చెప్పారు. త్వరలోనే స్టార్ హీరోలతో భారీ సినిమా చేయాలనుకుంటున్నట్లు మారుతి చెప్పుకొచ్చాడు.