సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని అంశాలు కలగలిపిన ఈ సినిమా సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకుంటుందని చిత్రబృందం ఆశిస్తోంది.

ఈ సినిమా మొదటిరోజు నాన్ బాహుబలి రికార్డులు బద్దలుకొట్టే విధంగా షోలు ప్లాన్ చేస్తున్నారు. 'దర్బార్' సినిమా మినహా థియేటర్లలో 11 నాటి మరో సినిమా ఉండదు. అందుకే జనవరి 10న అర్ధరాత్రి దాటినా తరువాత నుండే షోలు పడేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా అయితే 11న మార్నింగ్ షో పడేలోపు కనీసం మూడు షోలు వేసే అవకాశం ఉంటుంది.

స్టార్ హీరోలకు బజ్ ఇస్తున్న ముదురు భామలు!

ఆ తరువాత నాలుగు షోలు ఉంటాయి. కనీసం మొత్తంగా ఆరు షోలు కచ్చితంగా ఉంటాయి. పైగా 'దర్బార్' సినిమా ఆడే థియేటర్లలో కూడా అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారుఝామున స్పెషల్ షోలు వేసుకోవచ్చు. మొదటిరోజు బాహుబలి రికార్డ్ రావాలంటే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రావాలి. 'మహర్షి' సినిమాకి వచ్చింది రూ.26 కోట్లకు పైగానే..

మహేష్ బాబుకి ఇతర భాషలు, రాష్ట్రాల మార్కెట్ అంతగా లేదు. లేదంటే.. 'సైరా', 'సాహో' మాదిరిగా రికార్డులు వచ్చేవి. ఇప్పుడు ఆ లోటు పూడ్చడానికి ఎక్కువ థియేటర్లు, ఎక్కువ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాకి పోటీగా వస్తున్న బన్నీ 'అల.. వైకుంఠపురములో' సినిమా మాత్రం జనవరి 12న తెల్లవారుఝామున 5 గంటల షో నుండే మొదలుకానుంది.