Asianet News TeluguAsianet News Telugu

'సీతారామ కళ్యాణం': గీతాంజలికి ఎన్టీఆర్ స్వయంగా తిలకం దిద్ది..

ప్రముఖ నటీ’మణి' శ్రీమతి గీతాంజలిగారి స్మృత్యర్థం పాఠకులకు ఈ చిరు కానుక…శ్రీమతి గీతాంజలిగారికి అత్యంత పేరు తెచ్చిన చిత్రం సీత రామ కళ్యాణం. ఆ చిత్ర విశేషాలు మీ కోసం…

Director KV Reddy's Argument with Senior NTR
Author
Hyderabad, First Published Nov 7, 2019, 2:10 PM IST

ఎన్ ఏ టీ సంస్థలో వచ్చిన ఐదవ చిత్రం… 'జయసింహ' చిత్రంతో విజయాల బాట పట్టిన ఎన్ ఏ టీ సంస్థలో, 'పాండురంగ మహత్యం' వంటి ఘన విజయం తరువాత వచ్చిన చిత్రం 'సీతారామకళ్యాణం'. ఈ చిత్ర పూర్వాపరాలలోకి వెళితే, పాండురంగ మహత్యం చిత్రం తరువాత కేవీ రెడ్డిగారి దర్శకత్వంలో ఒక పౌరాణిక చిత్రం నిర్మించాలని మహానటుడు ఎన్టీఆర్ గారు  సంకల్పించారు.

కానీ, మాయాబజార్ వంటి చిత్రంలో శ్రీకృషుణుడిగా అలరించిన ఎన్టీఆర్, ఆ  తరువాత వేసే పౌరాణిక చిత్రంలో రాముడి వేషం ధరించాలని కేవీ రెడ్డిగారి సూచన… ఆ  దిశగా స్క్రిప్టువర్క్ కూడా సాగుతున్న దశలో, ఎన్టీఆర్ గారి స్నేహితుడు బుచ్చిరామ చౌదరిగారు, ఎన్టీఆర్ కి ఒక పుస్తకం ఇవ్వడం, అందులోని రావణ పాత్ర ఎన్టీఆర్ గారికి చాలా నచ్చడం జరిగింది.

పాత బంగారం:కనపడేది ఎన్టీఆర్..కానీ గొంతు వేరే వారిది

అప్పుడు ఎన్టీఆర్ గారు ఆ రావణ పాత్ర తాను వేస్తానని కేవీ రెడ్డిగారికి చెప్పగా, ఆయన అందుకు ససేమిరా అన్నారు. కృష్ణుడిగా చూపించిన ఎన్టీఆర్ ని ప్రతినాయక పాత్రలో, అందునా రాక్షషుడైన రావణ పాత్రలో చూపించడానికి ఎంత మాత్రము ఇష్టపడక, ఆ సినిమా దర్శకత్వమే వదిలేసుకున్నారు. ఎన్టీఆర్ గారు మాత్రం, తాను నమ్మిన కథను సినిమాగా మలిచి, తాను ఇష్టపడిన పాత్రకు ప్రాణప్రతిష్ట చేయడానికిగాను దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు.

సముద్రాల రాఘవాచార్యగారితో కథ, మాటలు, పాటలు వ్రాయించారు. ఎస్ రాజేశ్వరరావుగారితో సంగీతం అనుకున్నారు కానీ, కొన్ని కారణాల వల్ల రాజేశ్వరరావుగారు ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పుడు గాలిపెంచాల నరసింహరావుగారు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మొదటిసారిగా, తెలుగు తెరపై, రవికాంత్ నాగాయిచ్ కెమెరా పనితనం ఈ చిత్రం ద్వారానే కనిపించింది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇలా ఒక్కటవగా, ప్రధాన తారాగణం ఎంపిక ఒక సమస్యగా మారింది… ఎన్టీఆర్ రావణుడైతే, మరి రాముడు ఎవరు? సీత ఎవరు?

నందమూరి త్రివిక్రమరావుగారి సలహా ఏమిటంటే, రాముడు, రావణుడిగా ఎన్టీఆర్ గారే ద్విపాత్రాభినయం చేస్తే బాగుంటుంది అని.. కానీ, కథ ప్రకారం రాముడు 16 సంవత్సరాల పసివాడు.. కాబట్టి ఒక కొత్త నటుడుని రాముడిగా పరిచయం చెయ్యాలని ఎన్టీఆర్ గారి ప్రతిపాదన. ఆ కుర్ర రాముడి జోడీగా, ఒక బాల సీతను కూడా ఎంపిక చెయ్యాల్సిఉంది…ఇది ఇలా ఉండగా ఒక రోజు NTR గారు మద్రాసులోని పాండిబజార్లో ఒక యువకుడిని చూసారు.. ఆ కుర్రవాడే హరనాథ్… ఈ చిత్రానికి రాముడు.

అలాగే, ఒకానొక సిఫార్సు ప్రకారం, రాణి రత్నప్రభ సినిమాలో ఒక పాటకు నృత్యం చేసిన ఒక కొత్త అమ్మాయిని స్క్రీన్ టెస్టుకు పిలిచారు. ఆ అమ్మాయి పేరు మణి. రామారావుగారే తిలకం దిద్ది మరీ స్క్రీన్ టెస్ట్ చేయించారని అంటారు. ఆలా హరనాథ్ రాముడిగా, మణి సీతగా సెలెక్ట్ అయిపోయారు.

మిగిలిన పాత్రల విశేషాలకొస్తే:
-    కుంభకర్ణుడిగా కన్నడ నటుడు ఉదయ్ కుమార్ 
-    లక్ష్మణుడిగా శోభన్ బాబు
-    మండోదరిగా B సరోజ దేవి
-    నారదుడిగా TL కాంతారావు
-    విశ్వామిత్రుడిగా గుమ్మడి వెంకటేశ్వరరావు 


ఇంకో విశేషం ఏమిటంటే, లవకుశ సినిమాలో లవకుశులుగా నటించిన బాల తారలు, ఈ సినిమాలో చిన్ననాటి రామ లక్ష్మణులుగా, లవుడి పాత్రధారి ఒక సన్నివేశంలో ప్రహ్లాదుడిగా నటించారు. అప్పటికి inka లవకుశ సినిమా విడుదల కాకపోవడం గమనార్హం. రావణుడిగా ఎన్టీఆర్ పలికించిన హావభావాలు అనితరసాధ్యం. అటువంటి నటుడితో తన సినీ జీవితంలో మొట్టమొదటి సీన్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన మణి తరువాత రోజుల్లో, గీతాంజలిగా మనందరికీ సుపరిచుతురాలు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు… హీరోయిన్ గా,  విలన్ గా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా … ఆలా ఎన్నో చిత్రాలలో అద్భుతమైన నటన ప్రదర్శించిన గీతాంజలిగారు మన మధ్య లేక పోవడం బాధాకరం.

Follow Us:
Download App:
  • android
  • ios